జూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ

By Bojja Kumar

హైదరాబాద్: జూ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోంది. ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. సినిమా కథకు సంబంధించిన లైన్ ఓకే అయ్యిందని, త్వరలో స్క్రిప్ట్ వర్క్ మొదలుకానున్నట్లు చిత్ర సన్నిహిత వర్గాల సమాచారం. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలియవచ్చింది.

గతంలో త్రివిక్షికమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నవరత్న టాల్క్ యాడ్‌లో నటించారు. అప్పుడు వీరిద్దరి మధ్య సినిమా చర్చలు సాగినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు వీరి కాంబినేషన్ ఓకే అయింది. తర్వలో ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడనుంది. ప్రస్తుతం జూ ఎన్టీఆర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో 'బాద్ షా' చిత్రంలో నటిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మిస్తు ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుంది.

మరో వైపు ఎన్టీఆర్, హరీష్ శంకర్ కాంబినేషన్లో సినిమా ప్రారంభం అయింది. ఈ చిత్రానికి టైటిల్, హీరోయిన్, ఇతర తారాగణం ఫైనల్ కావాల్సి ఉంది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ- మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.

ఇక త్రివిక్రమ్ విషయానికొస్తే... ఇటీవలే జులాయి మూవీతో హిట్ కొట్టిన ఈ దర్శకుడు త్వరలో పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు. రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈచిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X