ఎన్టీఆర్, ఎఎన్ ఆర్ సినిమా రీమేక్ లో జూ ఎన్టీఆర్ తో పాటు మరో యంగ్ హీరో
ఆనాటి అగ్రకదానాయకులు ఏ.ఎన్.ఆర్, ఎన్టీఆర్ లు కలిసి నటించిన గుండమ్మకధ చిత్రాన్ని ఈతరం కధానాయకులైన స్వర్గీయ ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు మనవడు నాగ చైతన్య కలిసి రీమేక్ చేస్తున్నారు.
గుండమ్మ కధ రీమేక్ లో నటించేందుకు ఈ యువ కధానాయకులు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఆల్రెడీ నాగచైతన్యతో ఈ ప్రాజెక్ట్ గురుంచి చర్చించానని, ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుందో తెలియదు కానీ తప్పకుండా ఎప్పటికైనా ఆ చిత్రం రీమేక్ చేయాలని వుందని చెప్పారు ఎన్టీఆర్. అయితే మీ ఇద్దరికీ సరిపడే సూర్య కాంతం లాంటి అత్త పాత్రకు ఎరినైనా ఎంచుకొన్నారా అంటే.. ఎన్టీఆర్ మరియు ఎఎన్ఆర్ పాత్రలకు మీమిద్దరం సూట్ అవ్వంగాలేనిది అత్త పాత్ర కు ఎవరో ఒకరు సూట్ అవ్వకపోరు, దొరక్కపోరు అంటున్నారు జూ ఎన్టీఆర్.
జూ ఎన్టీఆర్ నాగచైతన్య గుండమ్మకథ ఎన్టీఆర్ ఎఎన్ఆర్ సూర్య కాంతం బందావనం jr ntr naga chaitanya gundamma katha ntr anr suryakantham brindavanam


Click it and Unblock the Notifications