జూ ఎన్టీఆర్, నాగార్జున గెస్ట్ పాత్రల్లో...
ఎన్టీఆర్ గెస్ట్ సాంగ్ లోనూ, నాగార్జున గెస్ట్ పాత్రలోనూ త్వరలో కనిపించి అలరించనున్నారు.అనూష్క ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న తకిట తకిట చిత్రంలో ఈ విశేషం చోటు చేసుకోనున్నది. భూమిక హోమ్ ప్రొడక్షన్ డౌన్ టౌన్ బ్యానర్ పై ఈ చిత్రాన్న దర్శకుడు శ్రీహరి నాను రూపొందిస్తున్నాడు. శ్రీహరి నాను గతంలో భూమిక హీరోయిన్ గా ఫిఫ్టీ ఫస్ట్ డేస్ చిత్రాన్ని తెలుగులో సత్యభామగా అందించిన సంగతి తెలిసిందే. ఇక లొ బడ్జెట్లో రూపొందుతున్న ఈ చిత్రంకి భూమిక పరిశ్రమలో తన పరిచయాలని వినియోగించి గెస్ట్ లుగా ఎన్టీఆర్ నీ, నాగార్జునని ఒప్పించింది. దాంతో అనూష్క, ఎన్టీఆర్ మధ్య సాంగ్ ప్లాన్ చేసారు. అన్నపూర్ణ స్టూడియోలో ఈ పాట చిత్రీకరణ కొద్ది రోజుల్లో మొదలవనుంది. మగధీర, అరుంధతి చిత్రాలకు కెమెరా అందించిన సెంధిల్ ఈ పాటకి పనిచేయనున్నాడు.
More from Filmibeat
జూ ఎన్టీఆర్ నాగార్జున అనూష్క భూమిక సత్యభామ సింహాద్రి అరుంధతి మగధీర jr ntr nagarjuna anushka bhumika arundhati takita takita


Click it and Unblock the Notifications











