Jr NTR: హిట్టయిన సినిమా పేరుతో ఫామ్ హౌస్.. భారీ ధరకు కొనుగోలు చేసిన ఎన్టీఆర్

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మొత్తానికి RRR సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కంటే ముందే ఈజీగా 100కోట్ల మార్కెట్ ను సొంతం చేసుకున్న తారక్ రెమ్యునరేషన్ స్థాయిని కూడా పెంచేశారు. ఇక ప్రస్తుతం చేయబోతున్న సినిమాలకు కూడా హై రేంజ్ లోనే పారితోషికం అందుకుంటున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ ఒక ఫామ్ హౌస్ కూడా కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

హై రెమ్యునరేషన్

హై రెమ్యునరేషన్

జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్న స్టార్స్ లో ఒకరిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. RRR సినిమా 1200కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడంతో తారక్ రేంజ్ ఒక్కసారిగా పెరిగింది. రాజమౌళి సినిమాకు రామ్ చరణ్ తో సమానంగా 45కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం.

భారీగా పెట్టుబడులు

భారీగా పెట్టుబడులు

ఇక పాన్ ఇండియా స్టార్స్ క్రేజ్ అందుకున్న తరువాత నిర్మాతల నుంచి భారీ స్థాయిలో అడ్వాన్స్ లు తీసుకుంటున్న హీరోలు ముందుగానే వచ్చిన ఆదాయాన్ని మొత్తం ఏదైనా ఒక బిజినెస్ లో పెట్టుబడిగా పెట్టేస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే తరహాలో ల్యాండ్స్ కొనేస్తూన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఎక్కువగా భూములను కొట్టే ఏడాది తిరిగే సరికి రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి.

న్యూ ఫామ్ హౌస్

న్యూ ఫామ్ హౌస్

ఇక జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా ఒక ఫామ్ హౌస్ ను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. Jr NTR గత సంవత్సరం భూమిని కొనుగోలు చేసిన తర్వాత హైదరాబాద్ శివార్లలోనే ఒక విశాలమైన ఫామ్‌హౌస్‌ను అభివృద్ధి చేసినట్లు సమాచారం. అందమైన తోటలతో కూడిన ఆ ఫామ్ హౌస్ 6.5 ఎకరాల్లో విస్తరించి ఉందట.

బృందావనం

బృందావనం

ఇక తారక్ తన ప్రియ సతీమణి లక్ష్మీ ప్రణతికి పుట్టినరోజు కానుకగా దీన్ని బహుమతిగా ఇవ్వాలనే ఆలోచనతోనే కొనుగోలు చేసినట్లు సమాచారం. ఫామ్‌హౌస్‌లో తన సన్నిహిత కుటుంబ సభ్యులకు పార్టీలు కూడా ఇస్తున్నారట. ఇక ఫామ్‌ హౌస్‌కి 'బృందావనం' అని పేరు పెట్టినట్లు సమాచారం. గతంలోనే ఈ టైటిల్ తో ఎన్టీఆర్ సినిమా చేశాడు. పచ్చదనంతో నిండి ఉంది కాబట్టి, ఇది ఫామ్ హౌస్‌కు కరెక్ట్ పేరు అని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.

దాని విలువ ఎంతంటే?

దాని విలువ ఎంతంటే?

ఇక ఎంతో ఖరీదైన ఆ ఫామ్ హౌస్ ను జూనియర్ ఏబీటీఆర్ దాదాపు 9 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ కోట్లల్లో విలువ చేసే కార్లను కూడా ఇదివరకే. కొనుగోలు చేశాడు. అలాగే అతని వాచ్ లు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ఇక ఇప్పుడు మొదటిసారి ఎన్టీఆర్ అత్యంత ఖరీదైన ఫామ్ హౌస్ ను కొనుగోలు చేశాడు.

 రాబోయే సినిమాలు

రాబోయే సినిమాలు

ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ 30వ సినిమాను కొరటాల శివతో చేయబోతున్న విషయం తెలిసిందే. అంతకుముందు వీరి కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్‌ ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు అంతకుమించి అనేలా మరో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఎన్టీఆర్ ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X