రామ్ చరణ్ ఇంటి ముందు జూనియర్ ఎన్టీఆర్ ఖరీదైన కారు.. వావ్ ఎంత సెక్సీగా ఉందో..
జూనియర్ ఎన్టీఆర్ ఒకసారి ఫ్రెండ్షిప్ చేస్తే ఎవరిని అంత ఈజీగా వదిలిపెట్టరు. ఖాళీ సమయం దొరికితే ఎక్కువగా ఫ్రెండ్స్ ఇంటికి కూడా వెళుతుంటాడు. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో రామ్ చరణ్ తో క్లోజ్ గా ఉంటున్న తారక్ తరచుగా కలుసుకోవడానికి ఇంటికి వెళుతుంటాడు. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లి పార్టీలు కూడా చేసుకుంటారు. ఇక రీసెంట్ గా ఖరుదైన కొత్త కారును కొనుగోలు చేసిన జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇంటికి వెళ్ళాడు. ప్రస్తుతం పార్క్ చేసిన ఉన్న ఆ కారు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మొదటి మెగా నందమూరి మల్టీస్టారర్
రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి కలిసి నటిస్తున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ RRR కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

అప్పటి నుంచి మరింత క్లోజ్
RRR కంటే ముందే మంచి స్నేహితులుగా ఉన్న రామ్ చరణ్ - ఎన్టీఆర్.. ఎప్పుడైతే షూటింగ్ స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి మరింత క్లోజ్ అయ్యారు. నార్మల్ ఫ్రెండ్స్ ఎలాగైతే ఉంటారో అలానే కొనసాగుతున్నారు. ఇక కొత్త కారు కొన్న వేళ మొదట రామ్ చరణ్ వద్దకు వెళ్లిన తారక్ అక్కడే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్నాడట.

ఎన్టీఆర్ కొత్త కారు వచ్చేసింది..
అత్యంత ఖరీదైన లాంబొర్కిని యూరస్ అనే మోడల్ కారును ఎన్టీఆర్ కొన్ని నెలల కిందటే బుక్ చేశాడు. చాలా నెలల అనంతరం అది డెలివరీ అయ్యింది. ఎన్టీఆర్ కు కార్లు బైక్స్ అంటే చాలా ఇష్టం. లగ్జరీ ఫీచర్స్‌తో పాటు సేఫ్టీగా ఉండే వాహనాలను కొనుగోలు చేస్తుంటాడు.
Recommended Video

లగ్జరీ లాంబొర్కిని..
5కోట్లకు పైగా విలువ చేసే ఇటాలియన్ లగ్జరీ లాంబొర్కిని యూరస్ కారు కోసం తారక్ గత ఏడాది నుంచి ఎదురుచూస్తున్నాడు. ఇక మొత్తానికి లాంచ్ అవ్వగానే టార్గెట్ చేసి బుక్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ కారుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక RRR అనంతరం తారక్ కొరటాల శివ ప్రాజెక్టును స్టార్ట్ చేయనున్నాడు.


Click it and Unblock the Notifications











