'రచ్చ' చేయడానికి క్లాప్ కొట్టిన జూ ఎన్టీఆర్
శ్రీ వెంకటేశ్వర బేనర్స్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'రచ్చ" (ఈ టైటిల్ ఇంకా ఫైనల్ కాలేదు) చిత్రానికి అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలు చేసారు. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధితులుగా వచ్చిన రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించగా, వి.వి. వినాయక్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. వక్కంతం వంశీ అందించిన ఈ కథకి యువ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ సంగీత స్వరాలను సమకుర్చనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఒక విభిన్నమైన పాత్రలో అభిమానులను అలరించనున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో మొదలవుతుందని చిత్ర దర్శకనిర్మాతలు తెలిపారు.
జూ ఎన్టీఆర్ రచ్చ సురేందర్ రెడ్డి రాజమౌళి వివి వినాయక్ తమన్నా jr ntr rachcha surender reddy rajamouli vv vinayak tamanna


Click it and Unblock the Notifications