Jr NTR: నందమూరి ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ఎన్టీఆర్ ఈవెంట్‌కు తారక్ దూరం.. అసలు కారణం ఇదే
తెలుగు సినీ వినీలాకాశంలో ఓ వెలుగు వెలిగిన ధృవతార విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. సుదీర్ఘ కాలం పాటు సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆయన శత జయంతి ఉత్సావాలను అభిమానులు ఎంతో వైభవంగా జరుపుకుంటోన్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు హైదరాబాద్‌లో ఓ గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. దీనికి ఎంతో మంది స్టార్లు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్పెషల్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ గైర్హాజరు అవుతున్నాడు. ఆ పూర్తి వివరాలు మీకోసమే!
ఏడాది ముందరే ఉత్సవాలు:నందమూరి తారక రామారావు మే 28వ తేదీకి 100వ జయంతిని పూర్తి చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది నుంచే నందమూరి అభిమానులు ఆయన శతజయంతి ఉత్సవాలను జరుపుతున్నారు. దీని పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలను సైతం జరుపుతున్నారు. ఇందులో భాగంగానే కొద్ది రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఈవెంట్‌ను నిర్వహించి రజినీకాంత్‌ను పిలిచారు.

భాగ్యనగరంలో మరో ఫంక్షన్:ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని ఇప్పటికే ఆయన అభిమాన సంఘాలు ఎన్నో కార్యక్రమాలను నిర్వహించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీలో ఉన్న కైతాలాపూర్ గ్రౌండ్స్‌లో భారీ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. దీన్ని మే 20వ తేదీన అంగరంగ వైభవంగా జరపనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ముగిశాయి.

రాజకీయ నాయకులు రాక:ఎన్టీఆర్ శతజయంతి ఉత్సావాల్లో భాగంగా ఈరోజు నిర్వహించబోతున్న ఈవెంట్‌కు నిర్వహకులు ఎంతో మంది రాజకీయ నాయకులను ఆహ్వానించారు. ముఖ్యంగా దీనికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గవర్నర్ బండారు దత్తాత్రేయ, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, పురందేశ్వరి, ఎమ్మెల్యే బాలకృష్ణ, సీతారాం ఏచూరి, సీపీఐ లీడర్ రాజా తదితరులు హాజరు కాబోతున్నారు.

ఎంతో మంది స్టార్లు కూడా:ఎన్టీఆర్ శతజయంతి ఉత్సావాలకు సినీ రంగానికి చెందిన ప్రముఖులను కూడా నిర్వహకులు ఆహ్వానించారు. ముఖ్యంగా కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్, విక్టరీ వెంకటేష్, దగ్గుబాటి రానా, ప్రభాస్, కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, రామ్ చరణ్, నితిన్, శర్వానంద్, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వంటి ఎంతో మంది హీరోలు దీనికి రాబోతున్నారు.

ఆ హీరోలంతా గైర్హాజరు అని:ఎంతో వైభవంగా జరగబోతున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సావాలకు సంబంధించి తాము ఎవరెవరిని పిలిచామో అన్న దానిపై ఇప్పటికే నిర్వహకులు లిస్టును రిలీజ్ చేశారు. అంతేకాదు, వాళ్లకు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే, దీనికి రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా కొందరు హీరోలు రావడం లేదని ఫిలిం నగర్ ఏరియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఎన్టీఆర్ కూడా రావట్లేదని:ఎన్టీఆర్ శతజయంతి ఉత్సావాలకు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వస్తుడడం బాగా హైలైట్ అయింది. మొన్నామధ్య జరిగిన ఈవెంట్‌లో అతడు కనిపించకపోవడంపై విమర్శలు వచ్చాయి. అయితే, ఇప్పుడు అతడికి ఆహ్వానం వెళ్లడంపై ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దీనికి ఎన్టీఆర్ రావడం లేదు. ఈ విషయాన్ని అతడి పీఆర్‌వోలు అధికారికంగా వెల్లడించారు.

అసలు కారణం అదేనట:ఎంతో గ్రాండ్‌గా జరగబోతున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సావాలకు జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాకపోవడానికి కారణం కూడా తెలిసింది. ఈరోజు అతడు పుట్టినరోజును జరుపుకుంటోన్నాడు. ఈ సందర్భంగా ఫ్యామిలీతో సమయాన్ని గడపడం కోసం గతంలోనే కమిట్‌మెంట్స్ ఇచ్చాడట. ఈ విషయాన్ని నిర్వహకులకు సైతం ముందే చెప్పినట్లు తాజా ప్రకటనలో తెలియజేశారు.


Click it and Unblock the Notifications











