NTR 30: ఎన్టీఆర్ మనసులో ఆచార్య భయం.. రిస్క్ తీసుకోలేక మరో నిర్ణయం?

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కలయికలో రాబోయే సినిమా పై అంచనాలు మొన్నటివరకు హై రేంజ్ లోనే ఉన్నాయి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత చేస్తున్న మరో బిగ్గెస్ట్ సినిమా కాబట్టి సోలో గా ఆ ప్రాజెక్టుతో బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు సక్సెస్ అందకుంటాడు అనేది అందరిలో ఆసక్తి కలిగించింది. అయితే అంత పాజిటివ్ గా ఉన్న సమయంలో హఠాత్తుగా దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ సినిమా కంటే ముందే ఊహించిన డిజాస్టర్ ఎదుర్కోవడంతో అభిమానుల్లో కొంత ఆందోళన అయితే నెలకొంది. ఇక ఆ ప్రాజెక్టు విషయంలో జూనియర్ ఎన్టీఆర్ రిస్క్ తీసుకోలేక ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

దారి దొరికింది

దారి దొరికింది

ఎప్పటి నుంచో తన స్థాయిని పెంచుకోవాలి అని చూస్తున్నా ఎన్టీఆర్ కు రాంచరణ్ కు RRR సినిమా మంచి బలాన్ని ఇచ్చింది అని చెప్పాలి. ఎలాగైనా పాన్ ఇండియా మార్కెట్ లోకి వెళ్ళాలి అనుకున్న వారికి దర్శకధీరుడు రాజమౌళి ద్వారా ఒక దారి దొరికింది. ఇక ఇప్పుడు ఏమాత్రం వెనక్కి తిరిగి చూసుకో కూడా అదే తరహాలో పాన్ ఇండియా మార్కెట్లో వరుస విజయాలు అందుకోవాలని ఎన్టీఆర్ రామ్ చరణ్ అడుగులు వేస్తున్నారు.

ఇద్దరిలో ఆచార్య టెన్షన్

ఇద్దరిలో ఆచార్య టెన్షన్

అయితే ఈ క్రమంలో ఇద్దరికీ కూడా ఊహించని చేదు అనుభవం ఎదురైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ప్రభావం ఇప్పుడు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్ ప్రాజెక్టులపై కూడా ఎంతోకొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఊహించని హైప్ వస్తేగానీ..

ఊహించని హైప్ వస్తేగానీ..

ముఖ్యంగా ఎన్టీఆర్ తో కొరటాల శివతో తదుపరి సినిమా చేయాలి కాబట్టి తప్పకుండా దర్శకుడు బ్యాక్గ్రౌండ్ కూడా మార్కెట్ పై ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. లేకపోతే సినిమాకి ఊహించని హైప్ వస్తేగానీ ఎక్కువగా ఎఫెక్ట్ పడదు. కానీ కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ్ ఇలా ఇద్దరు మెగా హీరోలతో సినిమా చేసినప్పటికీ కూడా ఆచార్య సినిమాపై అంచనాలను క్రియేట్ చేయలేక పోయాడు. సినిమా మొదటి రోజే ఊహించని విధంగా దెబ్బకొట్టింది.

ఎన్టీఆర్ భయం

ఎన్టీఆర్ భయం

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో పాన్ ఇండియా సినిమా కాబట్టి కొరటాల శివ ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది ఒక ప్రశ్న. ఆచార్య ఫలితంపై ఎన్టీఆర్ కూడా కాస్త అప్సెట్ అయినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఫ్యాన్ ఇండియా ప్రాజెక్ట్ తీసే ముందు దర్శకుడు ఇలాంటి ఫలితాన్ని ఎదుర్కొంటే తన ప్రాజెక్ట్ మార్కెట్ పై కూడా ప్రభావం చూపుతుంది అనే టెన్షన్ ఉండకుండా ఉండదు.

NTR30 బడ్జెట్

NTR30 బడ్జెట్

ఆచార్య సినిమా దాదాపు 80 కోట్ల వరకు నష్టపోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ తో చేయబోయే ప్రాజెక్టు కోసం 250 కోట్లకు పైగా ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి ఎన్టీఆర్ కొరటాల శివ NTR30 స్క్రిప్ట్ పై మరొకసారి సీరియస్ గా చర్చలు జరగపడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఏమాత్రం రిస్క్ తీసుకోకుండా నమ్మకం గా అనిపిస్తేనే ఆ తర్వాత ప్రాజెక్టు మొదలు పెట్టాలి అని ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

రిస్క్ తీసుకోలేక..

రిస్క్ తీసుకోలేక..

అసలైతే ఈ ప్రాజెక్టు ను ఎన్టీఆర్ పుట్టినరోజు ఈ సందర్భంగా మే 20వ తేదీన లో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ స్క్రిప్ట్ విషయంలో లోపాలను.. సందేహంగా అనిపించిన వాటిపై మళ్లీ ఫోకస్ చేయాలి అని.. మళ్ళీ వర్క్ చేయాలని చర్చలు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. RRR తరువాత ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ పై పట్టు సాధించాలని కోరికతో ఉన్నాడు. అందుకే ఆచార్య దెబ్బకు మళ్ళీ రిస్క్ తీసుకోకుండా మొహమాటం లేకుండా చర్చలు స్టార్ట్ చేసినట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X