జూ ఎన్టీఆర్ ని వదలబొమ్మాళీ వదల అంటున్నారు...!?
హీరో జూ ఎన్టీఆర్ ని ఉద్దేశించి వదల బొమ్మాళీ..అంటున్నాడు దర్శకుడు మెహర్ రమేష్. 'కంత్రి" సినిమాతో మొదలైన ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్ 'శక్తి" సినిమాతో రిపీట్ అయిన సంగతి తెల్సిందే. శక్తి సినిమా టైమ్ లో జూ ఎన్టీఆర్ తో ర్యాపో మరింత పెరిగిందంటోన్న మెహర్ రమేష్, ఎన్టీఆర్ లో గొప్ప నటుడున్నాడనీ, ఎన్టీఆర్ నట విశ్వరూపం 'శక్తి"లో అంతా చూస్తారని చెబుతున్నాడు.
జూ ఎన్టీఆర్ తో మళ్లీ ఖచ్చితంగా ఇంకో ప్రాజెక్ట చేస్తాననీ, ఆ వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని అంటున్నాడు రమేష్. ఎలాంటి సన్నివేశాలైనా అలవోకగా చేసేయడంలో ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా అని అంటోన్న మెహర్ రమేష్. 'శక్తి" సినిమా కోసం ఎన్టీఆర్ చేసిన ఫీట్లు ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయని అన్నాడు. నిర్మాత అశ్వినీదత్ ఖర్చుకు ఎక్కడా వెనకాడలేదనీ, నిర్మాత పెట్టిన ప్రతి పైసా సినిమా తెరపై కనిపించేలా చేయగలిగాననీ, ఆ విషయం సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు చెబుతారని ధీమా వ్యక్తం చేస్తున్నాడు మెహర్ రమేష్. ఇదిలా వుంటే, మెహర్ రమేష్ తో ఇంకోసారి వర్క్ చేయడానికి ఉత్సాహపడ్తున్న జూ ఎన్టీఆర్ ఈ ఏడాది చివర్లోనే ఆ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముంది.


Click it and Unblock the Notifications











