twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూపర్ హిట్ కొట్టబోయే పర్ఫెక్ట్ లెంగ్త్ స్టోరీ ‘ఊసరవెల్లి’..!

    By Sindhu
    |

    గత ఏడాది దసరా రోజున బృందావనం" చిత్రం విడుదలైంది. అప్పటికీ రజనీకాంత్ 'రోబో" విజయవిహారం చేస్తూ మధ్యలో వచ్చిన 'ఖలేజా" ని ఆనవాళ్లు లేకుండా చేసింది. అయినా కానీ జూ ఎన్టీఆర్, దిల్ రాజు దైర్యం చేసి ముందుకు దూకారు. బృందావనం సూపర్ హిట్ అయింది. రోబో రేంజ్ లో దూసుకుపోకపోయినా మంచి హిట్ అనిపించుకుంది. మరీ ఇప్పుడు రోబో రేంజ్ లో 'దూకుడు" వీరవిహారం చేస్తున్నాడు మరి దసరాకి రానున్న ఊసరవెల్లి ఈ సారి రిజల్ట్ ఎలా వుంటుందో చెప్పలేం కానీ ఆడియో, ట్రైలర్స్, డైలాగ్స్, ప్రొమోస్ సంకేతాల్ని బట్టి జూ ఎన్టీఆర్ మరో సూపర్ హిట్ కొట్టబోతున్నాడనిపిస్తుంది.

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ యాక్షన్ మూవీ ఊసరవెల్లిని గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఎంత లెంగ్త్ ఉంటుంది అనే దాని గురించి. ఈ చిత్ర నిడివి రెండు గంటల, 25 నిముషాలు ఉంటుందని అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది ప్రేక్షకులకు పర్ఫెక్ట్ లెంగ్త్ స్టొరీ అని చెప్పచ్చు. ఈ సినిమా 14.4 రీళ్ళు కలిగి ఉంటుంది. రీ-రికార్డింగ్ పని శబ్దాలయ స్టూడియో లో పూర్తి చేసుకుంది. ఈ నెల అనగా రేపు (30.09.11) న సెన్సార్ కు వెళ్ళనుంది.

    జూ ఎన్టీఆర్ సరసన తొలిసారి హీరోయిన్ గా అందాల తార తమన్నా నటిస్తుండగా, పాయల్ ఘోష్ కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆర్ ఆర్ మూవీ మేకర్స్ భారీ మొత్తం చెల్లించి, ఆంధ్ర ప్రదేశ్ పంపిణీ హక్కులు పొందింది. ఈ చిత్రం అక్టోబర్ 6 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఊసరవెల్లి చిత్రాన్ని స్టైలిష్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తుండగా, బివియస్ఎన్ ప్రసాద్ నిర్మాత. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ సమకూర్చారు. ఇప్పటికే ఈ చిత్ర ఆడియో కు మంచి స్పందన వచ్చింది. సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్.

    English summary
    Young Tiger NTR’s upcoming action entertainer Oosaravelli completed the re-recording works at Shabdalaya Studios today. The film completed its DTS mixing yesterday and according to our sources the first copy of the film will be readied by today. If everything goes as planned, the film will go to the censor tomorrow. The duration of the film is 2hours and 25minutes. BVSN Prasad is producing the film while Surender Reddy wields the megaphone. Tamannah is playing love interest of NTR in this film. Devi Sri Prasad has composed the music while Bapineedu is presenting it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X