జూ ఎన్టీఆర్, సురేంద్ర రెడ్డిల 'ఊసరవిల్లి' ఫస్ట్ లుక్ అదుర్స్
ఎన్టీఆర్, సురేంద్ర రెడ్డి కాంబినేషన్ లో ప్రారంభం అయిన 'ఊసరవిల్లి 'చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు.పోస్టర్ చూసిన వారికి సినిమా గురించి ఏ విధమైన క్లూ దొరకక పోయినప్పటికీ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్దమయ్యేలాగ ఉంది.అలాగే ఈ సినిమాకి ఇప్పటికి అతడే ఆమె సైన్యం వంటి మరో రెండు టైటిల్స్ పరిశీలించారు.అయితే ఇదే టైటిల్ ని ఫైనలైజ్ చేసారని ఈ పోస్టర్ తో అర్దమవుతోంది.ఇక రామ్ తోనూ, రానాతోనూ ఈ చిత్రాన్ని అనుకున్నారు కానీ వర్కవుట్ కాలేదు. ఇక ఈ చిత్రాన్ని నిర్మాత భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పగను హీరో తన శక్తులన్నీ ఒడ్డి తీరుస్తాడని,గజనీలాంటి గమ్మత్తైన పాయింట్ తో ఈ చిత్రం స్క్రిప్టు రెడీ అయిందైని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. యాక్షన్ కలగలిసిన లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని చెప్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన శక్తి చిత్రం విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకుంది.దాంతో ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆలోచనతో ఎన్టీఆర్ అన్ని జాగ్రత్తలు తీసుకుని రూపొందిస్తున్నాడంటున్నారు. ఇక సురేంద్రరెడ్డి, ఎన్టీఆర్ కాంబినేషన్ లో గతంలో అశోక్ చిత్రం వచ్చింది. అలాగే సురేంద్రరెడ్డి కిక్ విజయం తర్వాత చేస్తున్న చిత్రం ఇదే.


Click it and Unblock the Notifications











