twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యుఎస్ లో దూకుడు రికార్డ్ బద్దలు కొట్టే జూ ఎన్టీఆర్ ఊసరవెల్లి..

    By Sindhu
    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ భారీ యాక్షన్ మూవీ ఊసరవెల్లిని గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దూకుడు కంటే ఎక్కు వ ప్రిట్స్ తో విడుదలకు సిద్దమవుతోందని విశ్వనీయ సమాచారం. తాజాగా అందినటువంటి సమాచారం ప్రకారం ఒక్క నిజాంలోనే 200థియేటర్స్ లో విడుదల చేయుటకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే యుఎస్ లో 100థియేటర్లలో విడుదల చేసి ప్లాన్ వేస్తున్నారు. అదే కనుక జరిగితే మహేష్ 'దూకుడు" కంటే ఎక్కువ థియేటర్స్ 'ఊసరవెల్లి"విడుదలైతే జూ ఎన్టీఆర్ రికార్డ్ కొట్టినట్టే ఎందుకంటే మన తెలుగు సినమాలు యుఎస్ లో 19థియేటర్స్ తో మహేష్ రికార్డ్ సృష్టిస్తే ఊసరవెల్లి దాన్ని అధిగమించే దిశగా ఉంది.

    మహేష్ బాబు 'దూకుడు"తో సవాల్ చేసే సరికి 'ఊసరవెల్లి" తోక ముడిచి దాక్కుంటుందని కొన్ని వర్గాల వారు అంచనా వేశారు. కానీ వెన్ను చూపని తత్వాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ అమీతుమీ తేల్చుకోవడానికే సై అంటే సై అంటున్నాడు. దూకుడు సినిమాని సవాల్ చేస్తూ అక్టోబర్ 6న ఊసరవెల్లిగా ముందుకొస్తున్నాడు. మహేష్ సినిమాకి భారీగా థియేటర్లు పెట్టి మొదటి వారంలోనే వీలయినంత రాబట్టుకోవాలనే ప్రయత్నం చేసారు. అదే పద్దతిని ఊసరవెల్లి చిత్రానికి కూడా ఫాలో అవ్వాలని చూస్తున్నారు.

    దసరా పండగ సెలవులు అయ్యేలోగా ఊసరవెల్లితో మాగ్జిమం రాబట్టుకుని తన సత్తా చూపించాలని నిర్ణియించుకున్నాడు. మహేష్ కి తానే మాత్రం తీసిపోనని, ఓవర్సీస్ లో అతను కింగ్ అయితే, మాస్ ఫాలోయింగ్ లో తనకి మహేష్ సాటి రాలేడని చూపించడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. ఎన్టీఆర్ ఇలా దూకుడు కి ఎదురెళ్లి తొడగొట్టడంతో ఈ దసరా పోటీ భలే ఇంట్రెస్టింగ్ గా మారింది, అసలే దూకుడు తొలి వారంలో అనూహ్యమైన రికార్డుల్ని సెట్ చేయడంతో ఇప్పుడు దానికి ఎన్టీఆర్ ఎలా బదులిస్తాడనేది అమితాసక్తి రేకెత్తిస్తోంది.

    English summary
    Young Tiger NTR’s upcoming film Oosaravelli directed by Surender Reddy is gearing up for release on October 6. The makers are eyeing on huge openings and are planning to release the film with highest number of prints in NTR’s career. According to our sources, the movie will release in over 200 screens in Nizam territory alone.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X