twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    థ్రిల్ల్ కి గురిచేసే ‘ఊసరవెల్లి’ హైలైట్స్...!?

    By Sindhu
    |

    గత దసరాకు 'బృందావనం" వంటి సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ దసరాకు 'ఊసరవెల్లి"తో మరోసారి సంచలనం సృష్టించబోతున్నారు. 'కిక్" వంటి సూపర్ హిట్ తర్వాత సూపర్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి అందిస్తున్న మరో సూపర్ మూవీ 'ఊసరవెల్లి". 'ఛత్రపతి, డార్లింగ్" వంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన భారీ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మించిన మరో భారీ చిత్రం ఊసరవెల్లి".

    ఈ చిత్రం ప్రోగ్రెస్ గురించి నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ చెబుతూ 'స్విట్జర్లాండ్, ఇటలీ, ఫ్రాన్స్ లలో ఎన్టీఆర్, తమన్నాల పై రెండు పాటలు చిత్రీకరించాం. ప్రస్తుతం రామోజీ ఫిల్మిం సిటీలో భారీ సెట్స్ లో ఓ పాట తీస్తున్నాం. 16 నుండి నానక్ రామ్ గూడ రామానాయడు స్టూడియోలో నిర్మిస్తున్న సెట్స్ లో మరో పాట చిత్రీకరించడంతో ఈనెల 20కి షూటింగ్ పార్ట్ టోటల్ గా పూర్తవుతుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సూపర్ మ్యూజికల్ చేశారు. సెప్టెంబర్ 15 సాయంత్రం శిల్పకళావేదికలో చలనచిత్ర ప్రముఖులు, జూ ఎన్టీఆర్ అభిమానుల సమక్షంలో ఈ చిత్రం ఆడియోను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తాం.

    ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 6 విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేశాం. కొత్తకోణంలో చూపించే పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ ఇది. రొమాన్స్, యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్, మ్యూజిక్ అన్నీ మిక్స్ అయిన బిగ్ కమర్షియల్ మూవీ 'ఊసరవెల్లి". సిట్యుయేషన్ కి తగినట్లుగా రంగులు మార్చుకుంటూ తన టార్గెట్ ని పాజిటివ్ వేలో ఎలా రీచ్ అయ్యాడన్నది 'ఊసరవెల్లి" సబ్జెక్ట్. 'ఊసరవెల్లి"కి ఎవరూ ఊహించని మలుపులతో సాగే పటిష్టమైన కథ, ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించే స్ర్కీన్ ప్లే మెయిన్ హైలైట్స్.

    ఈ సినిమాలో చాలా హైలైట్స్ వున్నాయి..అవన్నీ స్ర్కీన్ మీద డైరెక్ట్ గా చూస్తేనే థ్రిల్...మేకింగ్ పరంగా ఈచిత్రానికి అన్ని హంగులూ ఎంతో పకడ్బందీగా సెట్ అయ్యాయి. మా ఎన్టీఆర్ కెరీర్ కి, మా బ్యానర్ కి ఇది ప్రెస్టీజియస్ ఫిలిం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ అంతటా ఆర్ ఆర్ ఫిల్మిం డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది" అన్నారు.

    English summary
    Jr Ntr starrer Oosaravell in the direction of Surender Reddy is scheduled for a release on 6th October on the eve of Dussera. The working stills of Oosaravelli are released and the audio is expected to be launched on 15th September. The movie will hit the screens on October 6th in higher expectations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X