జూ ఎన్టీఆర్ ఓపెన్ హార్ట్
సినమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఇగోలు కూడా అంత కంటే ఎక్కువే. దీన్నీ ఎవరూ కాదనలేరు. కానీ ఇటీవల జరిగిన 'గణేష్" ఆడియోలో ఎన్టీఆర్ స్పీచ్ వింటే...ఇండస్ట్రీలో ఇగోలకు చోటుందా? అనిపిస్తుంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ మాట్లాడుతూ...యాక్షన్ ఎపిసోడ్స్ చేయాల్సివస్తే...మంచి ఈజ్ తో రామ్ చేస్తాడు. అలాగే డాన్స్ చేసేటప్పుడు మంచి ఎనర్జిటిక్ గా చేస్తాడు. నేను పర్సనల్ గా ఇష్టపడే పది చిత్రాల్లో రామ్ నటించిన 'రెడీ" ఉంటుంది" అన్నారు. ఉల్లాసంగా డాన్స్ చేయడంలో..ఫోర్స్ గా ఫైట్ చేయడంలో....పవర్ ఫుల్ గా డైలాగ్ చెప్పడంలో ఎన్టీఆర్ కున్న పేరు అందరికీ తెలిసిందే. అలాంటి ఒక ఎనర్జిటిక్ హీరో మరో హీరోకున్న క్వాలిటీస్ మెచ్చుకోవడమంటే మాటలు కాదు. ఇలా ఓపెన్ హార్ట్ గా మాట్లాడడం అభినందనీయం.
ఇక తన నటుస్తున్న సినిమా విశయానికొస్తే వి.వి.వినాయక్ దర్శకత్వంలో వైష్ణవి ఆర్ట్స్ సంన్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నయనతార, షీలా కథానాయికలు. వల్లభునేని వంశీమోహన్ నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ ఇటీ వల పది రోజుల పాటు విదేశాల్లో సాగింది. తమిళ నాడులోని కుంభకోణంలో ప్రధాన సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. ఆ తరవాత కోల్ కత్తాలో జరిగే షేడ్యూల్ లో భారీ పైట్స్ తో పాటు, కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తారు. మాస్, యాక్షన్ అంశాతో పాటు వినోదానికి కూడా పెద్ద పీట వేస్తున్న చిత్ర మిది. డిసెంబరు మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











