అటు పవన్ కి, ఇటు జూ ఎన్టీఆర్ కి ఆగ్రహానికి గురైన ఇలియానా...
పతనమయ్యే రోజులు వస్తే పిచ్చి పనులు చేసి అందరితో సంబంధాలు చెడగొట్టుకుంటారనే దానికి ఇదో ఉదాహరణ. నిన్న మొన్నటి వరకు టాప్ హీరోయిన్ గా వెలిగిన ఇలియానా ఇప్పుడు రేపో మాపో తెలుగు చిత్ర పరిశ్రమలో పూర్తి కనిపించకుండా పోయేలా అనిపిస్తోంది. ఒకేసారి తెలుగు చిత్ర పరిశ్రమలోని రెండు అగ్ర కుటుంబాలతో ఆమె కయ్యం పెట్టుకుంది. శక్తి సినిమా ప్లాపవుతుందని ముందే తెలుసని, అలాంటి చెత్త సినిమాకి పబ్లిసిటీ చేయడం తన వల్ల కాదని పబ్లిగ్గా స్టేట్ మెంట్ ఇచ్చిన ఇలియానా, జూ ఎన్టీఆర్ కి ఇలా గాలి తీసేయడంతో ఎన్టీఆర్ కి తలకొట్టేసినట్టయింది. దాంతో ఇక ఇలియానాతో కలిసి నటించరాదాని నిర్ణయించుకున్నాడు.
కాగా దీనికంటే ముందే పవన్ కళ్యాణ్ కి కూడా ఇలియానా చిరాకు తెప్పించింది. తీన్ మార్ లో నటించాలంటే కోటిన్నర పారితోషికం ఇవ్వాలంటూ డిమాండ్ చేసేసరికి పవన్ కి మండింది. దాంతో ఆమెని తప్పించి త్రిషని కథానాయికగా తీసుకున్నాడు. తీన్ మార్ ప్లాపయి ఉండొచ్చు కానీ అలా చేయడం వల్ల ఇలియానా మెగా హీరోలకి కూడా దూరమవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఆమె దగ్గుబాటి రాణాతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తోంది కానీ ఇంకా తనేపాటి హీరో అన్న సంగతి రానాకే తెలీదు కాబట్టి అతనితో ఆమెకి సత్సంబధాలున్నా లేకపోయినా ఒకటేనని చెప్పాలి.


Click it and Unblock the Notifications











