ఇలియానా జూ ఎన్టీఆర్ కు తెలియకుండానే తీసేసింది...
ఇప్పుడున్న సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ పుణ్యమాని, బ్లాక్ బెర్రీ మొదలగు ఫోన్ల పుణ్యమాని మనకి ఎవరీదాగ్గర నుండి అయినా నిలుచున్న చోటు నుండే ఏం జరుగుతుందో తెలుసుకునే వీలు కలిగింది. పది మందికీ తెలియజేసే వెసులుబాటు దొరికింది. గోవా సుందరి ఇలియానాకి ట్విట్టర్ లో తన వృత్తి పరమయిన, వ్యక్తిగతమయిన విషయాలను పంచుకోవడం బాగా అలవాటు అయ్యింది. తన ఫోను ద్వారా ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ 'ట్విట్టర్" ద్వారా తెలియజేస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో కూడా ఇలియానా స్వయంగా తీసి 'ట్విట్టర్" లో పెట్టింది.
ఇలియానా ఎన్టీఆర్ ఫోటో ఎందుకు, ఎక్కడ తీసింది అనేగా…?వీరిద్దరూ కలిసి 'శక్తి" సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా..? ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో గత రెండు రోజులుగా జరుగుతోంది. షాట్ గ్యాప్ లో మన నందమూరి అందగాడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోనులో మెస్సేజ్ చూస్తుండగా…అతనికి తెలియకుండా ఇలియానా తన మొబైల్ ఫోను తీసి క్లిక్ మనిపించింది. వెంటనే 'ట్విట్టర్" లో ఈ ఫొటోని పోస్ట్ చేసి…"తారక్…లాస్ట్ ఇన్ థాట్"అని కామెంట్ చేసింది.


Click it and Unblock the Notifications











