జూ ఎన్టీఆర్ పక్కాప్లానే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ...
2010లో అదుర్స్, బృందావనం వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన జూ ఎన్టీఆర్ అదే ఊపులో 2011లో మూడు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు. జూ ఎన్టీఆర్ తీసుకున్న ఈ తాజా నిర్ణయం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. బోయపాటి శ్రీను దర్వకత్వంలో కెఎస్ రామారావు నిర్మించే చిత్రం పూజ ఈనెల 18ర జరుగుతుంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 1 నుండి ప్రారంభం అవుతుంది. ఇక కిక్ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఛత్రపతి ప్రసాద్ నిర్మించే చిత్రం షూటింగ్ ఈనెల 28 నుండే ప్రారంభం కాబోతోంది.
ఆగస్ట్ 12న ఈ చిత్రం రిలీజ్ అవుతుండగా, డిసెంబర్ లో బోయపాటి శ్రీను చిత్రం రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. కొంత ప్యాచ్ వర్క్ తప్ప షూటింగ్ పార్ట్ అంతా పూర్తి చేసుకున్న 'శక్తి" చిత్రాన్ని మార్చి 30న రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత అశ్వనీదత్ చెప్పారు. రెండు వరుస హిట్లతో ఉత్సాహంగా ఉన్న ఎన్టీఆర్ కి 2011లో రిలీజ్ అయ్యే ఈ మూడు చిత్రాలు కూడా బిగ్గెస్ట్ హిట్ అవుతాయని, ఆ చిత్రాల తర్వాత ఎన్టీఆర్ రేంజ్ చాలా హై లెవల్ లో వుంటుందని అభిమానులు ఆనందంగా చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











