twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మళ్లీ కాలేజీకి వెళ్లనున్న జూ ఎన్టీఆర్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ మళ్లీ కాలం తర్వాత కాలేజీ బాట పట్టబోతున్నాడు. ఈ సారి ఎలాగైన సరే తన స్టడీ క్వాలిఫికేషన్ పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇందంతా రియల్ లైఫ్ లో కాదు లెండి... రీల్ లైఫ్ లో. గతంలో స్టూడెంట్ నెం.1 చిత్రంలో కాలేజీకి వెళ్లే కుర్రాడిగా కనిపించిన జూ ఎన్టీఆర్... చాలా కాలం తర్వాత మళ్లీ అలాంటి పాత్రలో కనిపించబోతేన్నాడు.

    ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో 'బాద్ షా' చిత్రం చేస్తున్న జూ ఎన్టీఆర్...... మరో వైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ చిత్రానికి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ పాత్ర కాలేజీ కుర్రాడి నేపథ్యంలో ఉంటుంది. ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా వెల్లడించారు. ఇప్పటికే లాంచన ప్రాయంగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈచిత్రం ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

    ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఏమంటే... జూ ఎన్టీఆర్ కెరీర్లో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిన 'సింహాద్రి' చిత్రం విడుదల తేదీ(జులై 9)న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు షెడ్యూల్ రెడీ చేసుకున్నారు. ఇప్పటికే గబ్బర్ సింగ్ చిత్రంతో తన సత్తా చాటిన హరీష్ శంకర్ ఈచిత్రంలో జూ ఎన్టీఆర్‌ను తనతైన స్టైల్‌లో ప్రేక్షకుల ముందు ప్రజెంట్ చేయబోతున్నాడు.

    చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి 3 నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటించనుంది. ఇతర తారాగణం ఫైనల్ కావాల్సి ఉంది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ- మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్.

    English summary
    Tollywood Young Tiger jr Ntr play College Student role in his upcoming movie directed bu Harish Shankar. The news was revealed by Harish Shankar himself.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X