‘దమ్ము’లో జూ ఎన్టీఆర్ రాజకీయం!
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన 'దమ్ము' చిత్రం ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అయింది. సినిమా ఎలా ఉందనే విషయం పక్కన పెడితే ఈచిత్రంలో జూ ఎన్టీఆర్ రాజకీయ డైలాగులు ఇప్పుడు అందరినీ ఆకర్షించడమే కాదు, ఆలోచింప చేస్తున్నాయి. ఒక రకంగా ఈ డైలాగులు కాంగ్రెస్ సర్కాను టార్గెట్ చేసినట్లు ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.
పురుగులు పట్టిన బియ్యం, పుచ్చి పోయిన పప్పులు ఇస్తున్నారని, ప్రాజెక్టులు కడతామని చెప్పి ప్రజల డబ్బును దుర్వినియోగం చేశారని, కంపెనీలు తెస్తామని సెజ్‌ల పేరుతో భూములు లాక్కున్నారనే అర్థం వచ్చేలా ఈ చిత్రంలో డైలాగులులు ఉన్నాయి. అంతే కాదు దేవుడి ఆశీస్సులు, అభిమానుల అండ ఉంటే రాజకీయాల్లోకి వస్తానని ఈ సినిమా ద్వారా జూ ఎన్టీఆర్ అభిమానులకు మెసేజ్ ఇచ్చారు.
మొత్తానికి దమ్ము చిత్రం ద్వారా తనలోని రాజకీయ కోణాన్ని జూ ఎన్టీఆర్ బయట పెట్టాడని అంటున్నారు. అయితే టీడీపీలో జూ ఎన్టీఆర్ రాకీయాల్లోకి రాకుండా ప్రయత్నాలు జరుగుతున్నాయని, చంద్రబాబు కావాలనే జూనియర్‌ను తొక్కేస్తూ తన కొడుకు లోకేష్‌ను ఎంకరేజ్ చేస్తున్నాడనే గుసగుస చాలా కాలంగా వినిపిస్తున్నాయి.
నందమూరి హరికృష్ణ తరచూ చంద్రబాబును పరోక్షంగా విమర్శిస్తుండటం వెనక గల అసలు కారణం జూనియర్‌ను, తనను పార్టీలో ఎదగనీయక పోవడమే అని కొందరంటున్నారు. నందమూరి, నారావంశీయుల అంతర్గత గొడవల నేపథ్యంలో చంద్రబాబుతో సంబంధం లేకుండా సినిమాను మాధ్యంగా చేసుకుని తాత తరహాలో జూ ఎన్టీఆర్ రాజకీయ రంగానికి మార్గం సుగమం చేసుకుంటున్నాడని విశ్లేషకులు అంటున్నారు.


Click it and Unblock the Notifications











