twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జెర్సీపై జూ. ఎన్టీఆర్ మాట.. నాని బ్రో.. నువ్వు కొడితే బాల్ అవుట్ ఆఫ్ ది పార్క్!

    |

    నేచురల్ స్టార్ నాని సత్తా మరోమారు జెర్సీ చిత్రం ద్వారా బయట పడింది. గత ఏడాది పరాజయాల నుంచి తిరిగి పుంజుకుని అద్భుత చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నాని క్రికెటర్ పాత్రలో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. తొలి షో నుంచే జెర్సీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. క్రిటిక్స్ కూడా ఈ చిత్రాన్ని మంచి రివ్యూలు ఇస్తున్నారు. జెర్సీ చిత్రంలో నాని నటన, ఎమోషన్స్ తో వన్ మాన్ షో చేశాడని అంటున్నారు. సెలెబ్రిటీలు వరుసగా నానికి కంగ్రాట్స్ చెబుతూ సోషల్ మీడియా ద్వారా ప్రశంసిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నాని గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

    హ్యాట్సాఫ్ గౌతమ్

    హ్యాట్సాఫ్ గౌతమ్

    జెర్సీ చిత్రం చూసిన తర్వాత ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించాడు. జెర్సీ చిత్రం అద్భుతంగా ఉంది. నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇలాంటి కథని ఎంచుకుని, దానిని చక్కగా తెరకెక్కించిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరికి హ్యాట్సాఫ్. దర్శకుడి విజన్ కు తగ్గట్లుగా చిత్రంలోని నటీనటులు, సాకేతిక నిపుణుల పనితీరు కనిపిస్తోంది అని ఎన్టీఆర్ ప్రశంసించాడు.

     నాని బ్రో నువ్వు కొడితే

    నాని బ్రో నువ్వు కొడితే

    ఇక నాని ఎన్టీఆర్ ప్రశంసలతో ముంచెత్తాడు. నాని బ్రో.. నువ్వు కొడితే బంతి స్టేడియం బయట పడింది. బ్రిలియంట్ పెర్ఫామెన్స్.. నీ పెర్ఫామెన్స్ భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది అంటూ ఎన్టీఆర్ నాని నటనపై ప్రశంసల జల్లులు కురిపించాడు.

    జెర్సీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్జెర్సీ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

     క్రికెటర్ అర్జున్

    క్రికెటర్ అర్జున్

    నాని జెర్సీ చిత్రంలో క్రికెటర్ అర్జున్ పాత్రలో చెలరేగి నటించాడు. తొలి షో నుంచే జెర్సీ చిత్రానికి యునానిమస్ పాజిటివ్ టాక్ మొదలైంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. నేపథ్య సంగీతానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. శ్రద్దా శ్రీనాధ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. సత్యరాజ్ కీలక పాత్రలో నటించారు.

    ప్లాపుల తర్వాత

    ప్లాపుల తర్వాత

    డబుల్ హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న నానికి గత ఏడాది కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ చిత్రాలు బ్రేక్ వేశాయి. ఆ రెండు చిత్రాలు నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. దీనితో ఈ ఏడాది నాని క్రికెట్ నేపథ్యం ఉన్న కథని ఎంచుకుని చెలరేగి నటించాడు. జెర్సీ చిత్రం నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలుస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. నాని తదుపరి చిత్రం గ్యాంగ్ లీడర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

    English summary
    Jr NTR praises Nani and Gawtam Tinnanuri over Jersey movie success. Jersey movie released today worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X