తారక్‌పై వస్తున్న వార్తలు నిజమే: కన్ఫార్మ్ చేసిన బడా నిర్మాత

Recommended Video

Top Producer Clarifies On Jr NTR - Prashanth Neel Project || Filmibeat Telugu

వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్. ఈ ఊపులోనే అతడు తాజాగా మరో బడా ప్రాజెక్టు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'RRR'లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే తారక్ మరో క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నాడంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా దానికి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది.

‘కేజీఎఫ్' డైరెక్టర్‌తో సినిమా

‘కేజీఎఫ్' డైరెక్టర్‌తో సినిమా

‘కేజీఎఫ్' అనే సినిమాతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌ అయ్యాడు చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్‌. ఈ సినిమాలో యశ్‌ను ఎంతో ఎలివేట్ చేసి చూపించిన తీరుకు ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత ఆయనకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. ఎంతో మంది బడా నిర్మాతలు ప్రశాంత్‌తో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. ఆయనతో తారక్ సినిమా చేస్తున్నాడంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.

క్లారిటీ ఇచ్చిన నిర్మాత

క్లారిటీ ఇచ్చిన నిర్మాత

తారక్- ప్రశాంత్ నీల్ సినిమా గురించి తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మాత నవీన్ యెర్నేని స్పందించారు. ‘‘మేము ప్రశాంత్, తారక్‌తో చర్చలు జరుపుతున్న విషయం నిజమే. ప్రశాంత్ వచ్చి తారక్‌కు స్టోరీ చెప్పి, అది ఆయనకు నచ్చితే కచ్చితంగా ముందుకు వెళ్తాం. అన్నీ ఓకే అయితే బహుశా 2020 చివర్లో మా సినిమా ప్రారంభం అవుతుంది. అప్పటికి ఎన్టీఆర్ ‘RRR', ప్రశాంత్ ‘కేజీఎఫ్.. చాప్టర్ 2' పూర్తవుతాయి'' అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

గతంలోనే ప్రకటన

గతంలోనే ప్రకటన

‘కేజీఎఫ్' విడుదలైన తర్వాత ఈ సినిమా చూసిన మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు.. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌తో తాము సినిమా చేయ‌బోతున్నామ‌ని అనౌన్స్ చేసారు. అయితే, ఇందులో ఎవరు హీరోగా నటిస్తారని మాత్రం వెల్లడించడలేదు. మొదట్లో మాత్రం ఈ సినిమాను సూపర్‌స్టార్ మహేశ్ బాబుతో చేస్తారని ప్రచారం జరిగినా.. ఇప్పుడు తారక్ వైపు మళ్లింది.

‘కేజీఎఫ్.. చాప్టర్ 2' గురించి..

‘కేజీఎఫ్.. చాప్టర్ 2' గురించి..

‘కేజీఎఫ్.. చాప్టర్ 1' భారీ సక్సెస్ సాధించడంతో చిత్ర యూనిట్ దీనికి సీక్వెల్ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే ‘కేజీఎఫ్.. చాప్టర్ 2' షూటింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం 2020లో విడుదల కాబోతుంది. గతంలో ఈ సినిమా కోసం ఆడిషన్స్ కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.

 ఎన్టీఆర్ మాత్రం రాజమౌళికి లాక్

ఎన్టీఆర్ మాత్రం రాజమౌళికి లాక్

తారక్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి ‘RRR'లో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు.. అందునా బడా డైరెక్టర్ ఉండడంతో ఈ కాంబినేషన్ తెలుగు సినీ ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2020 జూలై 30న విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X