బ్రేకింగ్: Jr NTR పీఆర్వో, యువ నిర్మాత మహేష్ కోనేరు మృతి.. గుండెపోటుతో కన్నుమూత
తెలుగు సినిమా పరిశ్రమను మరో విషాదం వెంటాడింది. జర్నలిస్టు, యువ నిర్మాత, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పీఆర్వో మహేష్ కోనేరు ఆకస్మిక మృతి తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆయన మరణవార్తతో తెలుగు సినీ పరిశ్రమ షాక్ గురవుతున్నది. మహేష్ కోనేరు మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతికి సినీ ప్రముఖులు, జర్నలిస్టు మిత్రులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ కోనేరు మరణం, ఆయన కెరీర్ గురించిన వివరాల్లోకి వెళితే..

జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించి.
మహేష్ కోనేరు జర్నలిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. పలు వెబ్‌సైట్లలో సినిమా జర్నలిస్టుగా పనిచేశారు. అనంతరం సినిమా పీఆర్వోగా తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లారు. పలు సినిమాలకు ఆయన పీఆర్వోగా పనిచేశారు. ఎస్ఎస్ రాజమౌళి దర్వకత్వం వహించిన బాహుబలి చిత్రానికి ఆయన పీఆర్వోగా పనిచేశారు. జనతా గ్యారేజ్, సుప్రీం, శతమానం భవతి, నేను లోకల్, జై లవకుశ, అరవింద సమేత, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, గురు సినిమాలకు ఆయన పీఆర్వోగా, మీడియా స్ట్రాటెజిస్ట్‌గా పనిచేశారు.

ఎన్టీఆర్‌కు సన్నిహితుడుగా
సినిమా పరిశ్రమలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా గుర్తింపు ఉంది. ఎన్టీఆర్‌కు ఆయన వ్యక్తిగత పీఆర్వోగా సేవలందిస్తున్నారు. ఎన్టీఆర్‌కు అన్ని సమయాల్లో ఆయన అండగా ఉంటూ వచ్చారు. అలా ఎన్టీఆర్‌కు, సినిమాలకు పీఆర్వోగా సేవలందిస్తూనే సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టారు.

నిర్మాతగా మారిన మహేష్ కోనేరు
గత మూడేళ్ల క్రితం ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ను స్థాపించి పలు చిత్రాలను నిర్మించారు. కల్యాణ్ రామ్, తమన్నాతో నా నువ్వే, 118 మిస్ ఇండియా, తిమ్మరసు లాంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. సభకు నమస్కారం చిత్రాన్ని ప్రస్తుతం నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో ఉంది.

విశాఖపట్నంలో గుండెపోటుతో
తెలుగు సినిమా పరిశ్రమలో సున్నితమైన మనస్కుడుగా పేరున్న మహేష్ కోనేరు విశాఖపట్నంలో గుండెపోటుతో మరణించారు. గుండెపోటు రావడంతో ఆయన హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతుండగా ఆయన తుదిశ్వాస విడిచారు అని సన్నిహితులు తెలుపుతున్నారు. ఆయన మరణానికి సంబంధించిన వివరాలు ఇంకా అందాల్సి ఉంది.
Recommended Video

జూనియర్ ఎన్టీఆర్ సంతాపం
మహేష్ కోనేరు మరణ వార్తతో జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మహేష్ మరణవార్తతో గుండె ముక్కలైనంత పనైంది. ఈ వార్త నమ్మలేకపోయాను. నా ప్రియమైన మిత్రుడు మహేష్ కోనేరు ఇకలేరనే బరువెక్కిన గుండెతో తెలియజేస్తున్నాను. ఆయన మృతి వార్తతో షాక్ గురయ్యాను. మాటల రావడం లేదు. ఆయన స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం అని ఎన్టీఆర్ ట్వీట్‌లో తెలియజేశారు.


Click it and Unblock the Notifications











