దుమ్మురేపుతున్న బుడ్డోడే కానీ బుల్డోజర్ లాంటి వాడు జూ ఎన్టీఆర్
బుడ్డోడే కానీ బుల్డోజర్ అంటూ పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగ్స్ ని అక్షరాలా నిజం చేస్తున్నాడు జూ ఎన్టీఆయర్. మాస్ హీరోగా ఫేమస్ అయిపోవడంతో ఇక క్లాస్ మీద క్లాస్ మీద కాన్సన్ ట్రేట్ చేసిన ఎన్టీఆర్ ఇలాక్కూడా క్లిక్ అయిపోయాడు. గత వారం విడుదలైన 'బృందావనం" తొలి వారంలో మంచి వసూళ్లు రాబట్టుకుంది. ఇటీవల విడుదలై సంచలనం సష్టించిన రోబోని తలదన్నేలా బృందావనంకి చాలా చోట్ల రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.
జూ ఎన్టీఆర్ రెగ్యులర్ గా చేసే మాస్ సినిమాతో ఈ ఘనత సాధించి ఉంటే దాని గురించి చెప్పుకునేందుకు ఏమీ ఉండేది కాదు. కానీ తన ఇమేజ్ కి భిన్నంగా సినిమా చేసి మరీ జూ ఎన్టీఆర్ ఈ ఘనత సాధించాడు. కొందరు హీరోల్లా ప్లాప్ సినిమాతో ఈ ఘనత సాధించి ఉంటే దాని గురించి చెప్పుకునుందుకు ఏమీ ఉండేది కాదు. కానీ తన ఇమేజ్ కి భిన్నంగా సినిమా చేసి మరీ జూ ఎన్టీఆర్ ఈ ఘనత సాధించాడు. కొందరు హీరోల్లా ప్లాప్ సినిమాని హిట్ అని చెప్పుకోకుండా, జెన్యూన్ గా హిట్ కొట్టిన ఎన్టీఆర్ 'బృందావనం" తో మరోసారి తన స్టామినా ఏమిటన్నది ప్రపంచానికి తెలియజేశాడు.


Click it and Unblock the Notifications











