ఎన్టీఆర్ ‘రభస ' లేటెస్ట్ ఇన్ఫో

By Srikanya

హైదరాబాద్ : ఎన్టీఆర్ తాజా చిత్రం 'రభస ' (వర్కింగ్ టైటిల్) ఇటీవల హైదరాబాద్‌, జైపూర్‌లలో కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. ప్రస్తుతం పొల్లాచిలో షూటింగ్ జరుగుతోంది. అక్కడ ఎన్టీఆర్‌, సమంతలపై ఓ యుగళ గీతాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరి 4 వరకూ అక్కడే షూటింగ్‌ కొనసాగుతుంది. ఆ తరవాత టీమ్‌ హైదరాబాద్‌ వచ్చేస్తుంది. ఇక్కడ మరో దఫా షెడ్యూల్‌ మొదలుపెడతారు. ఎన్టీఆర్‌, సమంతల జోడీ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. 'బృందావనం', 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాల్లో అలరించిన ఈ ఇద్దరూ మూడోసారి జతకట్టారు. సంతోష్‌ శ్రీన్‌వాస్‌ దర్శకుడు. బెల్లకొండ సురేష్‌ నిర్మాత. ప్రణీత మరో హీరోయిన్.

నిర్మాత మాట్లాడుతూ... ''ఎన్టీఆర్‌ని కొత్తగా చూపించే చిత్రమిది. ఆయన సినిమాలో ఎలాంటి అంశాలు ఉండాలని ఆశిస్తారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి'' అన్నారు. ఈ చిత్రానికి 'రభస' అనే టైటిల్‌ పరిశీలిస్తున్నారు. 'అత్తమడుగువాగులోనా.. అత్తకూతురో' అనే పాటను రీమిక్స్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.

JR.NTR Rabhasa to shoot in Pollachi

దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ... మాస్‌ సినిమాలు చూస్తూ పెరిగినవాణ్ని నేను. నాకు ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో అలాంటివే తీస్తాను. ఎన్టీఆర్‌ అనగానే శక్తివంతమైన సంభాషణలే గుర్తుకొస్తాయి. అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఇందులో మాటలుంటాయి. ఎన్టీఆర్‌ కథ వినగానే నన్ను ప్రోత్సహించారు. నా తొలి చిత్రంలో హీరో ఎలాంటి బాధ్యత లేకుండా కనిపిస్తారు. కానీ ఇందులో హీరో పాత్రకి ఓ పెద్ద బాధ్యత ఉంటుంది. అది ఏమిటన్నది మాత్రం ఆసక్తికరం. ఇందులో సమంత పాత్ర కూడా కీలకమే'' అని చెప్పుకొచ్చారు.

ఇక... ఈ చిత్రంలో ప్లేబోయ్ గా కనపడతాడు. ఇంకో నాలుగైదు సినిమాల తర్వాత కానీ ఎన్టీఆర్‌తో పనిచేసే అవకాశం రాదేమో అనుకొన్నాను. కానీ రెండో ప్రయత్నంలోనే ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. అంతకంటే ఓ గొప్ప బాధ్యత నా భుజాన వేసుకొన్నానన్న ఆనందం కలుగుతోంది అన్నారు.ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉంటుందీ చిత్రం. మాస్‌ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో పాటు వినోదం, కుటుంబ అనుబంధాలకి ప్రాధాన్యమిస్తూ కథను రాశా. ఎన్టీఆర్‌ తెరపై మూడు కోణాల్లో సాగే పాత్రలో నటించబోతున్నారు. ఓ ప్లేబాయ్‌ తరహాలో ఆయన పండించే వినోదం యువతరాన్ని అలరిస్తుంది. ప్రతీ అభిమాని గర్వపడేలా ఉంటుందీ చిత్రం అన్నారు.

ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : తమన్‌ , ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X