రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ అదుర్స్
నటుడు, నిర్మాత మురళీమోహన్ నిర్మాణంలో జయభేరి ఆర్ట్స్ బేనర్ లో జూ.ఎన్టీఆర్ తో దర్శకుడు రాజమౌళి ఒక సినిమా నిర్మించనున్నట్లు సినిమా వర్గాల సమాచారం. అలా జరిగినట్లైతే మహేష్ బాబతో తీసిన 'అతడు" తర్వాత మురళీమోహన్ నిర్మిస్తున్న చిత్రమిదే అవుతుంది.
'మగధీర"తో దర్శకధీర అనిపించుకుని వరుసగా ఏడో హిట్ను తన ఖాతాలో వేసుకున్న రాజమౌళి చిత్రంలో నటించాలని ఎవరికి ఉండదు? ప్రస్తుతం ఆయన కోయంబత్తూర్లో నెక్ట్స్ సినిమా స్టోరీ డిస్కషన్ లో నిమగ్నమై ఉన్నారు. సునీల్, సలోని జంటగా ఈ సినిమా రూపోందుతోంది. నెల రోజుల క్రితం ఈ సినిమా ఓపెనింగ్ రామానాయుడు స్లూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా అనంతరం ఆయన దర్శకత్వంలో ప్రభాస్ నటించే అవకాశాలు మెరుగ్గావున్నాయి. ఈ రెండూ పూర్తయిన తర్వాత జూ.ఎన్టీఆర్ తో తీసే నాలుగో చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించనున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











