జూ ఎన్టీఆర్, రాజమౌళి కొత్త సినిమా డీటేల్స్
రాజమౌళి, జూ ఎన్టీఆర్‌లకు ఉన్న బంధం ఎలాంటిదో కొత్తగా చెప్పక్కర్లేదు. జూనియర్ ఫేవరెట్ ఎవరంటే రాజమౌళి...రాజమౌళి ఫేవరెట్ ఎవరంటే జూ ఎన్టీఆర్. వారిద్దరిని ఈ విషయం అడిగినా, ఇంకెవరినీ అడిగినా ఇదే సమాధానం వస్తుంది. ఇతర సినిమాల విషయంలో ఆ చిత్రాన్ని ఎలా హిట్ చేయాలి, నిర్మాతలకు లాభాలు ఎలా తేవాలి అని ఆలోచిస్తూ ఉంటాను.
కానీ తారక్ సినిమా విషయంలో మాత్రం నా ఆలోచన అతని కెరీర్‌కి ఎలా ఉపయోగ పడుతుంది అని ఉంటుందని స్వయంగా రాజమౌళి పలు సందర్భాల్లో చెప్పారు కూడా. వీరి కాంబినేషన్లో ఇప్పటికే స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ లాంటి హాట్రిక్ హిట్ చిత్రాలు వచ్చాయి. తర్వాత మళ్లీ వీళ్ల సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
తాజాగా అందిన సమాచారం ప్రకారం వీరి సినిమా ఖరారైంది. ఈగ చిత్రాన్ని నిర్మించిన సాయి కొర్రపాటి వారాహి చలనచిత్రం పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈచిత్రం వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. ఆ లోపు జూనియర్ తను కమిట్ అయిన చిత్రాలు పూర్తి చేయనున్నాడు. రాజమౌళి ప్రభాస్‌తో సినిమా పూర్తి చేయనున్నాడు.
ప్రస్తుతం జూ ఎన్టీఆర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో 'బాద్ షా' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో తాకర్ స్టన్నింగ్ లుక్‌తో కొత్తగా కనిపించనున్నాడు. అతని హెయిర స్టయిల్ కూడా పూర్తిగా చేంజ్ కాబోతోంది. ఫుల్లీలోడెడ్ కామెడీ, యాక్షన్ అంశాలతో ఈచిత్రం స్కిప్టును తయారు చేసింది శ్రీను వైట్ల అండ్ టీం. బండ్ల గణేష్ ఈచిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











