SP Balasubrahmanyam.. ఈ భువిలో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎమోషనల్
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతితో సంగీత ప్రపంచం మూగబోయింది. కోట్ల మంది అభిమానుల్ని ఒంటరి చేసి స్వర్గానికి పయనమయ్యారు. ఆగస్ట్ 5న కరోనా పాజిటివ్ రావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్నా కూడా ఆరోగ్యం మాత్రం కుదుటపడేలేదు. నిన్న సాయంత్రం పరిస్థితి విషమించడంతో నేడు (సెప్టెంబర్ 25) ఒంటి గంట నాలుగు నిమిషాలకు ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. ఇక ఈ వార్త తెలిసిన సినీ ప్రముఖులంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు.
Recommended Video

మీరు లేకున్నా..
ఎస్పీబీ మరణ వార్త తెలుసుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్ ఎమోషనల్ అయ్యారు. ఆగిపోయింది మీ గుండె మాత్రమే మీ గొంతు కాదు ... మీరెప్పుడు మాతోనే ఉన్నారు ఉంటారు .... అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక నారా రోహిత్ స్పందిస్తూ.. మీరు లేకున్నా మీ గాత్రం మాతోనే ఉంటుంది...ఓం శాంతి !! గానగాంధర్వుడు బాలసుబ్రమణ్యం గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను అంటూ కన్నీరు మున్నీరయ్యాడు.

ఎప్పటికీ అమరులే..
‘తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా,16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ , పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రం గా కలచివేసింది. ఈ భువి లో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే' అని ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యాడు.

రామ్ చరణ్ ఎమోషనల్
ఎస్పీబీ మరణ వార్త తెలుసుకున్న వెంటనే రామ్ చరణ్ స్పందించాడు. ఈ వార్త విని షాక్ అయ్యాను. ఎప్పుడూ నవ్వుతూ ఉండే బాలు గారు లేరని వార్తను జీర్ణించుకోలేకపోతున్నాను. మా సినీ ప్రపంచానికి ఈ లోటు ఎన్నడూ భర్తీకానిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అంటూ రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యాడు.

మళ్లీ అలాంటి గొంతు రాదు..
ఎస్పీబీ లేరని మాటని తట్టుకోలేకపోతున్నాను.. అసలు ఆ విషయం నమ్మలేకపోతున్నాను. అలాంటి గాత్రం, మనసును తాకే ఆ గొంతు మళ్లీ రాదు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మీరు సాధించిన విజయాలు, మీ లెగసీ ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ మహేష్ బాబు ఎమోషనల్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











