ఫ్యాన్‌కి దూరంగా చరణ్, ఎన్టీఆర్...నకిలీలతో డేంజర్!
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గతంలో ఎల్లప్పుడు ట్విట్టర్ ద్వారా అభిమానులకు అందుబాటులో ఉండే వాడు. తన అభిప్రాయాలను వారితో పంచుకునే వాడు. ఏమైందో తెలియదు వాటికన్ సిటీకి హనమూన్‌కి వెళ్లి వచ్చిన అనంతరం చరణ్ ఉన్నట్టుండి తన ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేశాడు. అప్పటి నుంచి అసలు అభిమానులకు టచ్‌లో ఉండటమే మానేసాడు చెర్రీ.
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల క్రితమే ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసినా...కొన్నేళ్లుగా అందులో అప్టేడ్స్ చేయడమే మానేసాడు. ఇలా యంగ్ టైగర్ కూడా అభిమానులకు దూరంగా ఉంటున్నాడు. అయితే ఇదే అదునుగా నకిలీలు తమ హవా కొనసాగిస్తున్నారు.
గతంలో రామ్ చరణ్ ట్విట్టర్ ఐడి @alwayscharan. దాన్ని డిలీట్ చేయడంతో కొందరు అదే పేరుతో మరో ఐడి క్రియేట్ చేసి రామ్ చరణ్ చేసినట్లుగా పోస్టులు చేస్తున్నారు. జూ ఎన్టీఆర్ కూడా అతని ఒరిజినల్ ట్విట్టర్ స్తంభించి పోవడంతో కొందరు ఆకతాయిలు జూ ఎన్టీఆర్ పేరుతో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసారు.
అయితే ఈ ఫేక్ అకౌంట్ల వల్ల ఎప్పటికైనా ప్రమాదం తప్పదని, అందులో ఏమైనా చేయకూడని వ్యాఖ్యలు, పోస్టులు చేస్తే అభిమానుల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.


Click it and Unblock the Notifications











