మూవీ మొగల్ నిర్మాణ సారధ్యంలో జూ ఎన్టీఆర్ ‘రాముడు భీముడు’....
నాలుగున్నర దశాబ్దాలుగా శతాధిక చిత్రాలను నిర్మించిన మూవీమొఘల్ డాక్టర్ డి.రామానాయుడు తన కెరీర్ కు, బ్యానర్ కు తొలి విజయాన్ని అందించిన 'రాముడు-భీముడు' చిత్రాన్ని మాత్రం ఇప్పటికీ ఘనంగా చెప్పుకుంటారు. నటరత్న ఎన్టీఆర్ కథానాయకుడుగా నటించిన ఈ చిత్రానికి తాపీ చాణక్య దర్శకత్వం వహించారు. 1964లో ఈ చిత్రం విడుదలై సురేష్ బ్యానర్ కు మంచి పేరు తెచ్చింది. రామానాయుడు తొలిసారి నిర్మించిన చిత్రం, ఎన్టీఆర్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఈ చిత్రాన్ని మళ్లీ రీమేక్ చేసేందుకు రామానాయుడు సన్నాహాలు చేస్తున్నారు.
నందమూరి మూడోతరం వారసుడుగా తిరుగులేని ఇమేజ్ తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇందులో కథానాయకుడుగా నటించబోతోన్నారు. అందుకు కథ తయారీలో పడ్డారు. భీముడు పాత్రదారి క్లబ్బుల్లో పాటగాడిగా మార్సులు చేస్తున్నారు. యన్టీఆర్ పాత చిత్రంలో నాటకాలు వేసేవాడి వేషంలో ఉంటుంది. అదీ భీముడు వేషం ఇప్పుడు జూ ఎన్టీఆర్ తో ఆవేషం తీయలేమని ఇలా మార్చుకున్నారు. ఇక గుండమ్మ కథ కూడా తీసే మూడ్ లో ఒకరిద్దరు నిర్మాతలున్నారు. అక్కినేని వారసుడు సుమంత్, జూ ఎన్టీఆర్ తో తీద్దామని నిర్మాతల యోచన. ఇలా అనుకుని చాలాకాలం అయినా ఇప్పుడు కార్యరూపం లోకి వస్తోందని తెలుగు సినిమా ఇండస్ట్రీ చెప్పుకుంటోంది.


Click it and Unblock the Notifications











