జిరాక్స్ కాపీ: జూ ఎన్టీర్ చిన్నతనంలో అలానే, చిలిపిగా (రేర్ ఫోటోలు)
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ మే 20తో 31 సంవత్సరాలు పూర్తి చేసుకుని 32వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా జూ ఎన్టీఆర్ తన కొడుకు అభయ్ రామ్ ఫోటోలు విడుదల చేసారు. చిన్న తనంలో ఎన్టీఆర్ ఎలా ఉన్నాడో అచ్చం అలానే జిరాక్స్ కాపీ లాగా అభయ్ రామ్ ఉండటం గమనార్హం.
పుట్టిన రోజు సందర్భంగా జూ ఎన్టీఆర్ గురించిన సినిమా సంగతులను నెమరు వేసుకుంటూ అతనికి సంబంధించిన చిన్ననాటి ఫోటోలపై ఓ లుక్కేద్దాం. విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు మనవడైన జూ ఎన్టీఆర్ మే 20, 1983న జన్మించాడు. తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి షాలిని. అంతా అతన్ని ముద్దుగా తారక్ అని పలుస్తుంటారు.
చిన్నతనం నుండే నటనపై ఆసక్తిపెంచుకున్న తారక్ మొదట కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందాడు. తారక్ లోని కళాభిమానానికి ముగ్ధులైన ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రములో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు.

జిరాక్స్ కాపీ
ఈ ఫోటోచూస్తుంటే ఎన్టీఆర్, అభయ్ రామ్ జిరాక్స్ కాపీలా ఉన్నారు కదూ.

బాల రామాయణం
బాల రామాయణము చిత్రములో రాముడిగా నటించాడు. 2001లో హీరోగా ‘నిన్ను చూడాలని' చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. ఆ చిత్రం అంతగా ఆడకపోయినా ప్రేక్షకులను ఆకర్షించగలిగాడు.

జూ ఎన్టీఆర్
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా విజయం, మంచి పేరు సాధించాడు. ఆ చిత్రం విజయవంతమవడం తో విరివిగా అవకాశాలు రాసాగాయి.

ఫ్యాన్స్
ఆ తర్వాత వచ్చిన సుబ్బు నిరాశ పరిచింది. ఆ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వం లో వచ్చిన ‘ఆది' చిత్రంలో అతని నటన చూసి ఎంతో మంది అతని అభిమానులుగా మారారు.

సింహాద్రి
మళ్ళీ అల్లరి రాముడు బాగా ఆడలేదు. ఆ తరువాతి సింహాద్రి చిత్రం మాత్రం తెలుగు సినీ చరిత్ర లోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా విజయం తో అతను అగ్ర నటులలో ఒకనిగా ఎదిగాడు.

వరుస చిత్రాలు
సింహాద్రి చిత్రం తర్వాత ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ చిత్రాల్లో నటించాడు జూ ఎన్టీఆర్.

రాఖీ
రాఖీ చిత్రం బాక్సాఫీసు వద్ద అనుకున్న ఫలితాలు ఇవ్వక పోయినా అతని నటన విమర్శకుల ప్రశంశలనందుకుంది.

ఆ ఇద్దరూ దర్శకులంటే...
జూ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహిత దర్శకులు రాజమౌళి, వివి వినాకయ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ చిత్రాలు జూ ఎన్టీఆర్‌ను హీరోగా నిలబెట్టాయి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది, అదుర్స్ చిత్రాలు భారీ విజయం సాధించాయి.

ప్లాపులు ఇచ్చిన దర్శకుడు
జూ ఎన్టీఆర్ కెరీర్లో భారీ ప్లాపులు ఇచ్చిన దర్శకుడు మెహర్ రమేష్. 2008 లో "మెహర్ రమేష్" దర్శకత్వంలో నటించిన "కంత్రి" అనే చిత్రం పరాజయం పొందింది. 2011 లో "మెహర్ రమేష్" దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మాణంలో వచ్చిన "శక్తి" చిత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే అతిపెద్ద ప్లాపు చిత్రంగా నిలిచింది.

నెక్ట్స్
త్వరలో జూ ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.


Click it and Unblock the Notifications











