twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జూ.ఎన్టీఆర్...చిన్నతనంలో ఇలా చిలిపిగా (రేర్ ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నేటితో 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని 31వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్భంగా జూ ఎన్టీఆర్ గురించిన సినిమా సంగతులను నెమరు వేసుకుంటూ అతనికి సంబంధించిన చిన్ననాటి ఫోటోలపై ఓ లుక్కేద్దాం.

    విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు మనవడైన జూ ఎన్టీఆర్ మే 20, 1983న జన్మించాడు. తండ్రి నందమూరి హరికృష్ణ, తల్లి షాలిని. అంతా అతన్ని ముద్దుగా తారక్ అని పలుస్తుంటారు. చిన్నతనం నుండే నటనపై ఆసక్తిపెంచుకున్న తారక్ మొదట కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందాడు. తారక్ లోని కళాభిమానానికి ముగ్ధులైన ఎన్టీఆర్ బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రములో బాలనటునిగా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు.

    తరువాత బాల రామాయణము చిత్రములో రాముడిగా నటించాడు. 2001లో హీరోగా 'నిన్ను చూడాలని' చిత్రం ద్వారా తెరంగేట్రం చేశాడు. ఆ చిత్రం అంతగా ఆడకపోయినా ప్రేక్షకులను ఆకర్షించగలిగాడు. మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...

    జూ ఎన్టీఆర్

    జూ ఎన్టీఆర్

    ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా విజయం, మంచి పేరు సాధించాడు. ఆ చిత్రం విజయవంతమవడం తో విరివిగా అవకాశాలు రాసాగాయి.

    ఫ్యాన్స్

    ఫ్యాన్స్

    ఆ తర్వాత వచ్చిన సుబ్బు నిరాశ పరిచింది. ఆ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వం లో వచ్చిన ఆది చిత్రంలో అతని నటన చూసి ఎంతో మంది అతని అభిమానులుగా మారారు.

    సింహాద్రి

    సింహాద్రి

    మళ్ళీ అల్లరి రాముడు బాగా ఆడలేదు. ఆ తరువాతి సింహాద్రి చిత్రం మాత్రం తెలుగు సినీ చరిత్ర లోనే అత్యంత భారీ విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ సినిమా విజయం తో అతను అగ్ర నటులలో ఒకనిగా ఎదిగాడు.

    వరుస చిత్రాలు

    వరుస చిత్రాలు

    సింహాద్రి చిత్రం తర్వాత ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ చిత్రాల్లో నటించాడు జూ ఎన్టీఆర్.

    రాఖీ

    రాఖీ

    రాఖీ చిత్రం బాక్సాఫీసు వద్ద అనుకున్న ఫలితాలు ఇవ్వక పోయినా అతని నటన విమర్శకుల ప్రశంశలనందుకుంది.

    ఆ ఇద్దరూ దర్శకులంటే...

    ఆ ఇద్దరూ దర్శకులంటే...

    జూ ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహిత దర్శకులు రాజమౌళి, వివి వినాకయ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ చిత్రాలు జూ ఎన్టీఆర్‌ను హీరోగా నిలబెట్టాయి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆది, అదుర్స్ చిత్రాలు భారీ విజయం సాధించాయి.

    ప్లాపులు ఇచ్చిన దర్శకుడు

    ప్లాపులు ఇచ్చిన దర్శకుడు

    జూ ఎన్టీఆర్ కెరీర్లో భారీ ప్లాపులు ఇచ్చిన దర్శకుడు మెహర్ రమేష్. 2008 లో "మెహర్ రమేష్" దర్శకత్వంలో నటించిన "కంత్రి" అనే చిత్రం పరాజయం పొందింది. 2011 లో "మెహర్ రమేష్" దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మాణంలో వచ్చిన "శక్తి" చిత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే అతిపెద్ద ప్లాపు చిత్రంగా నిలిచింది.

    ప్రస్తుతం రభస

    ప్రస్తుతం రభస

    ప్రస్తుతం జూ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ‘రభస'. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.

    తర్వాతి చిత్రం

    తర్వాతి చిత్రం

    రభస చిత్రం తర్వాత జూ ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.

    త్వరలో తండ్రి కాబోతున్న ఎన్టీఆర్

    త్వరలో తండ్రి కాబోతున్న ఎన్టీఆర్

    2011లో జూ ఎన్టీఆర్ వివాహం లక్ష్మి ప్రణతితో జరిగిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ దంపతులు ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ప్రస్తుతం లక్ష్మీ ప్రణతి గర్భవతి.

    English summary
    Nandamuri Taraka Rama Rao (born May 20, 1983) more popularly known as NTR Jr.,Tarak, or just NTR, is a popular Indian film actor. He is a grandson of Late Shri Nandamuri Taraka Rama Rao, who is a legendary actor, statesman, and former Chief Minister of Andhra Pradesh.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X