అనవసర వివాదాల్లోకి లాగొద్దు: జూ.ఎన్టీఆర్
హైదరాబాద్: ''బాద్‌షా రూపంలో నాకు పెద్ద విజయం లభించింది. ఈ ఆనందంలో ఉన్నప్పుడు నన్ను వివాదంలోకి లాగి ఆ సంతోషాన్ని దూరం చేయొద్దు. నన్ను కన్న నా తల్లిదండ్రులకు సేవలు చేసుకొంటూ, తాతగారిని స్మరించుకొంటూ గడిపేస్తా. నా శరీరంలో ఉన్నది ఆయన రక్తమే. దీని గురించి మళ్లీ మళ్లీ విడమరచి చెప్పను'' అని ఎన్టీఆర్ అన్నారు. అనవసర వివాదాల్లోకి తనను లాగవద్దని ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు.
వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలపై తన ఫొటో వాడటం గురించి విలేకరులు ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం 'బాద్‌షా' విజయోత్సవాన్ని సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీల వివాదంపై ఆయన స్పందించారు.
అలాగే ..''నా శరీరంలో ప్రవహిస్తున్నది నందమూరి తారకరామారావు రక్తం. నా బొందిలో ప్రాణం ఉన్నంతవరకు నా తాతగారు స్థాపించిన పార్టీవైపే మొగ్గు చూపుతాను. ప్రస్తుతం 'బాద్‌షా' విజయవంతమైన ఆనందంలో ఉన్నాను. దయచేసి ఇలాంటి వివాదాలలోకి లాగి నన్ను ఇబ్బంది పెట్టవద్దు. ఇప్పుడు నా ముందున్న బాధ్యత ఒక్కటే. నా తల్లిదండ్రులకు సేవ చేసుకోవడం, మంచి మంచి సినిమాలు చేయడం'' అని జూనియర్ ఎన్టీఆర్ స్పష్టంచేశారు.


Click it and Unblock the Notifications











