దమ్ముకి హాట్ తాప్సీ సరిపోదన్న జూ ఎన్టీఆర్..!?
జూ ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ములో శృతిహాసన్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. అలాగే ఆమె పదిరోజుల షూటింగ్ లో కూడా పాల్గొంది.అయితే షూటింగ్ ని ఊసరవెల్లికి బ్రేక్ ఇచ్చి ప్రారంభించటంతో ఆమె సారి చెప్పి బై చెప్పిందని సమాచారం. ఆమె తనకు డేట్స్ లేకపోవటంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్లు చెప్తున్నారు. అయితే ఆమె వాలంటరిగా టీమ్ కి గుడ్ లక్ చెప్పి బయిటకు వెళ్లటంతో ఈ మ్యాటర్ ఇష్యూ కాలేదు.
ఇప్పుడు ఆమె ప్లేసులోకి ఎవరిని తీసుకుంటారనేది హాట్ టాపిక్ గా మారింది. రాధిక కూతురు, జోష్ హీరోయిన్ కార్తీక అని, హన్సిక అని ఫిల్మిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. అయితే కాజల్ కావచ్చు అని మరి కొంతమంది చెప్తున్నారు. తాజా సమాచారం ప్రకారం తాప్సీని హీరోయిన్ గా ఎంపిక చేయడానికి ఈ చిత్ర నిర్మాత కెయస్ రామారావు సన్నాహాలు చేసాడట. జూ ఎన్టీఆర్ కి అయితే బల్క్ డేట్స్ కేటాయించడానికి నేను రెడీ అని తాప్సీ చెప్పిందట. కానీ ఎన్టీఆర్ మాత్రం తాప్సీకి నో చెప్పి కాజల్ కి ఓకే చెప్పినట్టు వార్తలు అందుతున్నాయి. కాజల్ కి ఎన్టీఆర్ ఓటేయ్యడంతో చేసేదిలేక ఈ చిత్ర దర్శక, నిర్మాతలు కూడా కాజల్ వైపే మొగ్గు చూపినట్టు సమాచారం. అలాగే సెకెండ్ హీరోయిన్ గా కూడా ఎవరిని తీసుకుంటారనేది ఇప్పటకీ తేలలేదు.
ఈ చిత్రం షూటింగ్ ఈ నెలాఖరుకు మొదలు కానుంది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఎక్కడ మాట్లాడినా 'దమ్ము"ప్రసక్తి తెస్తున్నారు. ఆ చిత్రం ఫ్యాన్స్ కి విందు భోజనంలా ఉంటుందని అని పని గట్టుకుని మరీ చెప్తున్నారు. అలాగే తాను లావు తగ్గి చేసే డాన్స్ లు హైలెట్ గా ఉంటాయని నొక్కి మరీ చెపున్నారు. భవిష్యత్ లో తాను లావు గా కనపడనని, గతంలో కనపించినంత లావుగా కానని, తగ్గిపోతానని,ఆ విషయం దమ్ము చిత్రం లో గమనించవచ్చునని ఎన్టీఆర్ తన అభిమానులకు హామీ ఇచ్చారు. అలాగే జూ ఎన్టీఆర్ ఇక తన దృష్టినంతా తాజా చిత్రం 'దమ్ము"పై కేంద్రీకరిస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కెయస్ రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











