twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'షేర్' కోసం యంగ్ టైగర్ వస్తున్నాడు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: హైదరాబాద్: నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా సాయి నిహారిక, శరత్‌చంద్‌ సమర్పణలో విజయలక్ష్మీ పిక్చర్స్‌ పతాకంపై మల్లికార్జున్‌ దర్శకత్వంలో కొమర వెంకటేష్‌ నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'షేర్‌'. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 30న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి నిర్మాత కొమర వెంకటేష్‌ సన్నాహాలు చేస్తున్నారు. ఆడియో వేడుక అక్టోబర్ 10న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన సీడీలు విడుదల చేయనున్నారు.

    ఈ సందర్భంగా నిర్మాత కొమర వెంకటేష్‌ మాట్లాడుతూ - ''మా సినిమాకి సంబంధించిన షూటింగ్‌ పార్ట్‌ టోటల్‌గా కంప్లీట్‌ అయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్‌ 30న వరల్డ్‌వైడ్‌గా చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. ఈ చిత్రం ఆడియోను అక్టోబర్‌ 10న చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నాం. థమన్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్‌ ఇచ్చారు. నిర్మాతల హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌గారితో 'షేర్‌'లాంటి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చెయ్యడం చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌ కొత్త డైమెన్షన్‌లో కనిపిస్తారు. మల్లికార్జున్‌ ఎక్స్‌ట్రార్డినరీ టేకింగ్‌తో సినిమా చాలా బాగా వచ్చింది. ఈ చిత్రానికి కళ్యాణ్‌రామ్‌గారి పెర్‌ఫార్మెన్స్‌ హైలైట్‌గా నిలుస్తుంది. 'పటాస్‌'తో సూపర్‌హిట్‌ సాధించిన కళ్యాణ్‌రామ్‌గారికి 'షేర్‌' మరో పెద్ద హిట్‌ సినిమా అవుతుంది'' అన్నారు.

     ​Jr NTR to release ‘Sher’ a​udio

    దర్శకుడు మల్లికార్జున్‌ మాట్లాడుతూ - ''అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం కళ్యాణ్‌రామ్‌గారి కెరీర్‌లో మరో సెన్సేషనల్‌ మూవీ అవుతుంది. ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్‌గారి పెర్‌ఫార్మెన్స్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా వుంటుంది. థమన్‌ సూపర్‌హిట్‌ సాంగ్స్‌ని చేశారు. ఆడియో కూడా పెద్ద హిట్‌ అవుతుంది'' అన్నారు.

    డైనమిక్‌ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్‌, సోనాల్‌చౌహాన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, రావు రమేష్‌, రోహిణి, షాయాజీ షిండే, ఆలీ, ఎం.ఎస్‌.నారాయణ, ముఖేష్‌ రుషి, ఆశిష్‌ విద్యార్థి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ-మాటలు: డైమండ్‌ రత్నబాబు, సంగీతం: థమన్‌ ఎస్‌.ఎస్‌., సినిమాటోగ్రఫీ: సర్వేష్‌ మురారి, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: సత్యశ్రీనివాస్‌, ఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌, స్టిల్స్‌: మనీషా ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: హరీష్‌రెడ్డి యల్లన్నగారి, మేనేజర్స్‌: బోడంపాటి శ్రావణ్‌కుమార్‌ గౌడ్‌, కురిమెండ్ల రవీంద్రగౌడ్‌, మేకప్‌: మోహనరావు, కాస్ట్యూమ్స్‌: శ్రీను, పబ్లిసిటీ డిజైనర్‌: ధని ఏలే, ఛీఫ్‌ కోడైరెక్టర్‌: బూరుగుపల్లి సత్యనారాయణ, కోడైరెక్టర్‌: శేషు బలగ, లైన్‌ ప్రొడ్యూసర్స్‌: దేవినేని బ్రహ్మానందరావు, బండి రత్నకుమార్‌, సమర్పణ: సాయి నిహారిక, శరత్‌చంద్‌, నిర్మాత: కొమర వెంకటేష్‌, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మల్లికార్జున్‌.

    English summary
    Nandamuri Kalyan Ram’s Sher ha​s completed its shoot​ and the audio of the film will be launched on the 10th of October. Latest update ​reveals that star hero NTR will grace the event as the chief guest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X