నన్ను 'గెటౌట్' అంటూ గెంటేశారు: జూ.ఎన్టీఆర్
హైదరాబాద్: నేనేమంత బ్యాడ్ స్టూడెంటును కాదు.. వరెస్ట్ స్టూడెంటును. ఎంతలా అంటే నన్నెవరూ భరించలేనంత. నా అల్లరి భరించడం మా అమ్మవల్లే కాలేదు. చితకొట్టేసేది. నా చదువూ మహా గొప్పగా సాగేది. పదో తరగతి వరకూ నా అల్లరి భరించిన అమ్మా, నాన్న ఇక లాభం లేదనుకుని వడ్లమూడిలోని విజ్ఞాన్ కాలేజీ హాస్టల్లో వేసేశారు. దాని యజమాని రత్తయ్య మహా స్ట్రిక్ట్. హాస్టల్ చదువు వద్దని ఏడ్చినా పట్టించుకునేవారు కారు. ఇంటికి ఫోన్ చేస్తే నా మాట వినకుండా కూడా అమ్మ ఫోన్ కట్ చేసేసేది...అంటూ జూ.ఎన్టీఆర్ తన గతం గుర్తు చేసుకున్నారు.
ఇక లాభం లేదనుకుని రెండు సార్లు ఇనుప రాడ్‌తో నా కాలు నేనే విరగొట్టుకున్నా. అలాగైనా హాస్టల్ నుంచి తీసుకెళతారని. నేను అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. కాలుకు కట్టు కట్టించి మళ్లీ హాస్టల్లోనే తోసేశారు. లాభం లేదనుకుని హాస్టల్‌లో నా అల్లరి విశ్వరూపం చూపా. నా గోల భరించలేక రత్తయ్య నన్ను గెటౌట్ అంటూ గెంటేశారు. రెండో సంవత్సరం హైదరాబాద్ సెయింట్‌మేరీస్‌లో వచ్చి పడ్డా. అక్కడ ఆ ఏడాది ఏదో మమ అనిపించి నా చదువును ఆపేశా. కానీ కూచిపూడి నాట్యంలో 12 ఏళ్లు శిక్షణ తీసుకున్నా అని చెప్పారు.

కెరీర్ విషయానికి వస్తే... ఇప్పుడు మరోసారి తన స్పీడు చూపించబోతున్నాడు. ఎన్టీఆర్ హీరోగా బెల్లంకొండ సురేష్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతోష్ శ్రీన్‌వాస్ దర్శకుడు. సమంత, ప్రణీత హీరోయిన్స్. రాజధానిలో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. పది రోజుల పాటు ఇక్కడే షూటింగ్ నిర్వహిస్తారు. ఆ తరవాత జైపూర్‌లో మరో షెడ్యూలు ప్రారంభిస్తారు. ఈ సినిమాకి 'రభస' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ... మాస్ సినిమాలు చూస్తూ పెరిగినవాణ్ని నేను. నాకు ఎలాంటి చిత్రాలు నచ్చుతాయో అలాంటివే తీస్తాను. ఎన్టీఆర్ అనగానే శక్తివంతమైన సంభాషణలే గుర్తుకొస్తాయి. అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఇందులో మాటలుంటాయి. ఎన్టీఆర్ కథ వినగానే నన్ను ప్రోత్సహించారు. నా తొలి చిత్రంలో హీరో ఎలాంటి బాధ్యత లేకుండా కనిపిస్తారు. కానీ ఇందులో హీరో పాత్రకి ఓ పెద్ద బాధ్యత ఉంటుంది. అది ఏమిటన్నది మాత్రం ఆసక్తికరం. ఇందులో సమంత పాత్ర కూడా కీలకమే'' అని చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో ప్లేబోయ్ గా కనపడతాడు అని చెప్తున్నారు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.
ఇక... ఇంకో నాలుగైదు సినిమాల తర్వాత కానీ ఎన్టీఆర్‌తో పనిచేసే అవకాశం రాదేమో అనుకొన్నాను. కానీ రెండో ప్రయత్నంలోనే ఆయనతో సినిమా చేసే అవకాశం రావడం నా అదృష్టం. అంతకంటే ఓ గొప్ప బాధ్యత నా భుజాన వేసుకొన్నానన్న ఆనందం కలుగుతోంది అన్నారు.ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా ఉంటుందీ చిత్రం. మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో పాటు వినోదం, కుటుంబ అనుబంధాలకి ప్రాధాన్యమిస్తూ కథను రాశా. ఎన్టీఆర్ తెరపై మూడు కోణాల్లో సాగే పాత్రలో నటించబోతున్నారు. ఓ ప్లేబాయ్ తరహాలో ఆయన పండించే వినోదం యువతరాన్ని అలరిస్తుంది. ప్రతీ అభిమాని గర్వపడేలా ఉంటుందీ చిత్రం అన్నారు.
ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఒక మంచి వినోదాత్మక చిత్రంగా తీర్చదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, ఫోటోగ్రఫీ : శ్యామ్ కె నాయుడు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ : ఎ.ఎస్.ప్రకాష్, సమర్పణ : బెల్లంకొండ సురేష్, నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : సంతోష్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











