Just In
- 2 hrs ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 2 hrs ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 3 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 4 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సుకుమార్ మూవీ: ఇద్దరితో ఎన్టీఆర్ రిమాన్స్, ఎవరు?
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' చిత్రం ఈ నెల 13న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. పూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా విడుదలైన వెంటనే స్మాల్ గ్యాప్ తీసుకుని తన తర్వాతి ప్రాజెక్టుతో బిజీ కాబోతున్నాడు యంగ్ టైగర్.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ తర్వాతి సినిమా సుకుమార్ దర్శకత్వంలో ఉండబోతోంది. మార్చి 1న ఈ సినిమా మొదలవుతుందని అంటున్నారు. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని, హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
సుకుమార్ తయారు చేసుకున్న కథ ప్రకారం సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. ఇందుకోసం హన్సిక, రకుల్ ప్రీత్ సింగ్‌లను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో ఎవరైనా హాండిస్తే రాశి ఖన్నాను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలస్తోంది. త్వరలోనే ఆ విషయం అనేది ఫైనలైజ్ కానుంది. ఈ చిత్రాన్ని ‘అత్తారింటికి దారేది' నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ చిత్రానికి పని చేయబోతుండటం విశేషం.

టెంపర్' సినిమా విషయానికొస్తే...ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెనర్ ఫస్ట్ లుక్, థియేట్రికల్ ట్రైలర్ విడుదలయినప్పటి నుండి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. మాగ్జిమం నెంబరాఫ్ థియోటర్స్ లో విడుదల అవుతున్న ఈ చిత్రం మొదటి షో హైదరాబాద్ భ్రమరాంబ థియోటర్ లో ఉదయం 5.07 నిముషాలకు విడుదల కానుంది.
ఈచిత్రాన్ని వెస్ట్ గోదావరిలో పూరి జగన్నాథ్ స్వయంగా విడుదల చేయబోతున్నాడు. ఇందుకోసం ఆయన పాపుల డిస్ట్రిబ్యూటర్ సురేస్ మూవీస్‌తో జతకట్టినట్లు తెలుస్తోంది. ఈ జిల్లా రైట్స్ కోసం పూరి జగన్నాథ్ రూ. 2 కోట్ల 50 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. తాను దర్శకత్వం వహించిన చిత్రాన్ని....ఇంత రేటు పెట్టి మరీ పూరి జగన్నాథ్ కొనడం హాట్ టాపిక్ అయింది. సినిమాపై ఆయనకు చాలా కాన్ఫిడెన్స్ ఉండబట్టే ఇలా చేసాడని అంటున్నారు. ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్, బండ్ల గణేష్ నిర్మాత. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.