RRR Bheem: ఎన్టీఆర్ కొత్త పోస్టర్‌తో సర్‌ప్రైజ్ చేసిన టీమ్.. వామ్మో ఆ బాడీ ఏంటి సామీ!

తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి పరచయం చేసిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి చిత్రంతో ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన ఈ దర్శకధీరుడు.. అన్ని ఇండస్ట్రీలూ టాలీవుడ్‌ వైపు చూసేలా చేశాడు. ఈ జోష్‌తోనే ఇప్పుడు RRR (రౌద్రం రణం రుధిరం) అనే సినిమా చేస్తున్నాడు. భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న ఈ చిత్రంలో తెలుగు స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ భారీ మల్టీస్టారర్ మూవీ నుంచి భీమ్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం? దీనిపై మీరూ ఓ లుక్కేయండి!

రియల్ హీరోలుగా మారిన స్టార్లు

రియల్ హీరోలుగా మారిన స్టార్లు

భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత కథల ఆధారంగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రమే RRR (రౌద్రం రణం రుధిరం). డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. ఇందులో చరణ్.. అల్లూరిగా, తారక్.. కొమరం భీంగా చేస్తున్నారు.

ఆ ఆటంకాలతోనే పూర్తి చేశారు

ఆ ఆటంకాలతోనే పూర్తి చేశారు

RRR మూవీ రెగ్యూలర్ షూటింగ్ 2018లోనే ప్రారంభం అయింది. దీన్ని ఎంత త్వరగా పూర్తి చేయాలని భావించినా అనివార్య కారణాలతో తరచూ చిత్రీకరణ వాయిదా పడుతూనే వచ్చింది. మరీ ముఖ్యంగా కరోనా కారణంగా ఇది రెండు సార్లు ఆపేయాల్సి వచ్చింది. ఫలితంగా చిత్రీకరణ అంతకంతకూ ఆలస్యం అవుతూనే వచ్చింది. ఇలా ఈ సినిమా మూడేళ్లు పూర్తి చేసుకుంది కూడా.

రిలీజ్ డేట్‌ అదే... డౌట్లు కూడా

రిలీజ్ డేట్‌ అదే... డౌట్లు కూడా

2020లోనే RRR ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, షూటింగ్ పూర్తి కాని కారణంగా అది సాధ్యపడలేదు. దీని తర్వాత 2021 జనవరి 8కి విడుదల చేస్తున్నట్లు ప్రకటించినా షూట్ కంప్లీట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను అక్టోబర్ 13, 2021న రిలీజ్ చేస్తామని తెలిపారు. కానీ, దీన్ని 2022 జనవరి 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, దీనిపై డౌట్లు వస్తూనే ఉన్నాయి.

ట్రైలర్ వాయిదా.. మళ్లీ ఇప్పుడు

ట్రైలర్ వాయిదా.. మళ్లీ ఇప్పుడు

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న RRR మూవీ ట్రైలర్‌ను డిసెంబర్ 3న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కానీ, అనివార్య కారణాల వల్ల దీన్ని అప్పుడు రిలీజ్ చేయలేకపోయారు. దీంతో అభిమానులు నిరాశగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ట్రైలర్‌ను డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

దానికి ముందే రెండు వస్తాయని

దానికి ముందే రెండు వస్తాయని

RRR ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసేశారు. ఇప్పటికే పాటలు, గ్లిమ్స్ వీడియో వదిలారు. ఇప్పుడు ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయనున్నారు. దీని కోసం ఫ్యాన్సే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు భీమ్ పోస్టర్‌ను, సాయంత్రం 4 గంటలకు రామ్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
కండలు తిరిగిన బాడీతో వచ్చాడు

కండలు తిరిగిన బాడీతో వచ్చాడు

ముందుగా ప్రకటించిన దాని ప్రకారమే.. సోమవారం ఉదయం 11 గంటలకు కొమరం భీం పాత్రను పోషిస్తోన్న జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో అతడు కండలు తిరిగిన బాడీతో రెండు చేతులతో తాళ్లు పట్టుకుని ఉన్నాడు. దీంతో ఈ పోస్టర్‌కు నందమూరి ఫ్యాన్స్ నుంచే కాదు.. అన్ని వర్గాల వాళ్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X