జూ ఎన్టీఆర్ ఆధార్ కార్డు ఇదే...(ఫోటో)
హైదరాబాద్ : ఆధార్..ఆధార్..ఆధార్! ఈ మధ్య ఎక్కడ చూసినా ఇదే హడావుడి. ఏ పని జరుగాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి అయిపోయింది. సామాన్యుడైనా...సినీ స్టార్ అయినా, ఇంకెవరైనా సరే ఈ కార్డు తప్పనిసరి కలిగి ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అందులో భాగంగా ప్రముఖ సినీ నటుడు, యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ కూడా ఆధార్ కార్డు పొందాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌కు సంబంధించిన ఆధార్ కార్డు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. బహుషా అభిమానుల కోసమే దీన్ని ఆన్ లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. మరి దానిపై ఓ లుక్కేయండి...
జూ ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే....ప్రస్తుతం జూ ఎన్టీఆర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం స్పయిన్లో జరుగుతోంది. ఈచిత్రానికి సంబంధించిన ఆడియో సెప్టెంబర్ 8న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇటీవల 'జాబిల్లి నువ్వే చెప్పమ్మా' అనే ఒక పాటను నిర్మాత దిల్ రాజు, సంగీత దర్శకుడు తమన్ కలిసి విడుదల చేసారు.
ఈ చిత్రం తర్వాత జూ ఎన్టీఆర్ 'రభస' అనే చిత్రంలో నటించనున్నాడు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈచిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈచిత్రంలో షాయాజీ షిండే, జయసుధ, బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి, నాజర్, అజయ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించనున్నారు.


Click it and Unblock the Notifications












