For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కేక పెట్టిస్తున్న ‘బాద్ షా’ కొత్త ఫోటోలు

  By Srikanya
  |

  హైదరాబాద్: ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'బాద్ షా'. పరమేశ్వర ఆర్ట్‌‌స పతాకం పై బండ్ల గణేష్‌ నిర్మిస్తున్నారు. బండ్ల శివబాబు సమర్పకుడు. ఈ సినిమా టీజర్‌ ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. ప్రతిష్ఠాత్మక చిత్రం 'బాద్‌షా' ఏప్రిల్ 5న విడుదల కానుంది.

  ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా హీరో ఎన్టీఆర్ మాట్లాడుతూ శ్రీనువైట్ల కథ బాగుండడంతో, ప్రేక్షకులు నన్ను ఎలా చూడాలనుకుంటున్నారో అలా వుండడంతో ఈ చిత్రం చేస్తున్నానని తన కెరీర్‌లో సరికొత్త స్టైల్‌లో ఓ సెనే్సషనల్ మూవీగా బాద్‌షా నిలుస్తుందని తెలిపారు.

  దర్శకుడు శ్రీనువైట్ల మాట్లాడుతూ ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగిన విధంగా యాక్షన్ ఎమోషన్ ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలన్నీ ఉంటాయని, వేసవి కానుకగా ఏప్రిల్ 5న చిత్రాన్ని విడుదల చేయనున్నామని అన్నారు. ఎన్టీఆర్ లుక్స్, స్టైల్, డైలాగ్, డాన్స్, ఫైట్స్ అన్నీ ప్రేక్షకులను అలరిస్తాయని, ఈ నెల 16 నుండి నాన్‌స్టాప్‌గా జరిగే చివరి షెడ్యూల్‌తో చిత్రం పూర్తవుతుందని మార్చి 10న ఆడియో విడుదల చేయనున్నామని నిర్మాత బండ్ల గణేశ్ తెలిపారు.

  ఈ నెల 16 నుంచి చివరి షెడ్యూల్‌ చిత్రీకరణ మొదలవుతుంది. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

  బాద్‌ షా కోసం తమన్‌ అందించిన ‘సైరా సాయ్‌రా...' సాంగ్‌ నెట్‌లో లీకయి హల్‌చల్‌ చేస్తోంది. ఈ పాట ఎన్టీఆర్‌ అభిమానులు సహా ప్రేక్షకాభిమానులందరినీ ఆకట్టుకుంటోంది.

  మహష్‌ ‘బిజినెస్‌ మేన్‌'కి అద్భుతమైన బాణీలు అందించిన తమన్‌ మరోసారి అదే రేంజ్ పాటల్ని బాద్‌షా కోసం సిద్ధం చేస్తున్నారని ఈ పాట చెప్పకనే చెబుతోంది. మాస్‌, ఫాస్ట్‌బీట్‌ స్టెప్పులతో హోరెత్తించే జూనియర్‌కి తగ్గ బాణీని తమన్‌ ఇచ్చారని ప్రశంసలొస్తున్నాయి.

  నిర్మాత మాట్లాడుతూ- ‘‘తెలుగు చిత్రపరిశ్రమలోనే భారీ బడ్జెట్ చిత్రం ఇది. ఎన్టీఆర్, కాజల్‌లతో పాటు తెలుగు, తమిళ, హిందీ రంగాలకు చెందిన 50మందికి పైగా ప్రముఖ నటీనటులు ఇందులో నటిస్తున్నారు.

  ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ''ప్రేక్షకులు నన్ను ఎలా చూడాలనుకొంటారో అదే తరహాలో ఉండబోతోంది 'బాద్‌షా'. ఇందులో నా వేషధారణ, హావభావాల దగ్గర్నుంచి ప్రతి విషయంపైనా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొంటున్నారు దర్శకుడు. నా కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రంగా నిలుస్తుంది'' అన్నారు.

  "ఎన్టీఆర్‌ ఇమేజ్‌కి తగ్గట్టుగా చిత్రాన్ని తీర్చిదిద్దాం. వినోదం, భావోద్వేగాలు, యాక్షన్‌... ఇలా అన్ని అంశాలూ సమపాళ్లలో కుదిరాయి. ఎన్టీఆర్‌ని సరికొత్తగా చూపించబోతున్నాం. వేసవికి వస్తున్న ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులకీ వినోదం పంచుతుంది" అన్నారు దర్శకుడు.

  ''కథాబలమున్న చిత్రమిది. 'బాద్‌ షా డిసైడైతే.. వార్‌ వన్‌సైడ్‌ అయిపోద్ది...' అంటూ విడుదల చేసిన తొలి ప్రకటన చిత్రానికి విపరీతమైన స్పందన లభించింది. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు. మార్చి 10న పాటల్ని విడుదల చేస్తాము'' అన్నారు నిర్మాత.

  ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాద్‌ షా'. కాజల్‌ కథానాయిక. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత. ఈ చిత్రానికి సంగీతం ఎస్.ఎస్. థమన్, మాటలు: గోపీమోహన్, కోన వెంకట్, ఎడిటింగ్ ఎం.ఆర్.వర్మ, కెమెరా: ఎ.ఎస్.ప్రకాశ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేశ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీను వైట్ల.

  బండ్ల గణేష్ తన ట్వీట్ లో.... "'బాద్‌ షా' చిత్రం ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. నా సోదరుడు శ్రీను వైట్లకు సిన్సియర్ ధాంక్స్.. అంతేగాక లవ్ లీ టీమ్ కు కూడా నా కృతజ్ఞతలు..... అనుమానమే లేకుండా బాద్షా చిత్రతం తెలుగు ఇండస్ట్రీలోని టాప్ 3 చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది. ధాంక్యూ యంగ్ టైగర్ మరియు శ్రీను వైట్ల, గోపీ మోహన్, కోన వెంకట్, కె.వి గుహన్.." అని ట్వీట్ చేసారు.

  English summary
  Jr Ntr’s “Baadshah” is progressing in brisk space. Film's new photo's has been unveiled just a while ago. Kajal Agarwal is casted opposite NTR, while Srinu Vytla and Producer Bandla Ganesh are very confident about the film. Here is the first look of Baadshah new photos.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X