ఎన్టీఆర్ 'బాద్‌షా' కథ గురించి తమన్

By Srikanya

దమ్ము'తో అభిమానుల్ని అలరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ఇప్పుడు 'బాద్‌షా'గా నవ్వించటానకి రెడీ అవుతున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఈనెల 15 నుంచి హైదరాబాద్‌లో షూటింగ్ మొదలుపెడతారు. తమన్‌ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రం పూర్తిస్ధాయి ఎంటర్టైన్మెంట్ తో నిండి ఉంటుందని తమన్ హామీ ఇస్తున్నారు. ఆయన ఈ చిత్రం కథ విని ట్వీట్ చేసి ఎన్టీఆర్ అభిమానులను ఆనందపరిచారు.

తమన్ ట్వీట్ లో...'బాద్‌షా' స్క్రిప్టు సూపర్ గుడ్...ఫెంటాస్టిక్ ఎంటర్టైన్మెంట్. చాలా ఎనర్జీతో ఉంటుంది. మంచి సిట్యువేషన్స్ తో గొప్ప విజువల్ ఫీస్ట్ లా అలరిస్తుంది అని ట్వీట్ చేసారు. జూన్ కి మూడు పాటలు కంపోజింగ్ ఫినిష్ చేస్తానని అంటున్నారు. తాను ఇటువంటి ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నందకు ఎక్సైట్మెంట్ ఫీలవుతున్నానని తెలిపారు. ప్రస్తుతం శ్రీను వైట్ల చిత్రం స్క్రిప్టు ఫినిషింగ్ టచ్ లలో బిజీగా ఉన్నారన్నారు.

ఇక తను 'బాద్‌షా'కి ఇవ్వబోయే పాటలు గురించి ట్వీట్ చేస్తూ...'బాద్‌షా'ఫుల్ స్వింగ్ లో ఉంది. విపరీతమైన ఎక్సైట్ మెంట్ లో ఉన్నాను. మూడు పాటలు జూన్ కి పూర్తవుతాయి. జూలైలో 'బాద్‌షా'కి మరిన్ని సర్పైజ్ లు తోడవుతాయి అని ట్వీట్ చేసారు. ఇక శ్రీను వైట్ల ఈ చిత్రం కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ ని ఉపయోగిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో ప్రి విజువలైజేషన్ పార్ట్ కోసం వీరిని ప్రత్యేకంగా వినియోగించనున్నట్లు తెలిపారు.

ఈ చిత్రం గురించి నిర్మాత గణేష్ బాబు మాట్లాడుతూ..ఎన్టీఆర్, శ్రీను వైట్ కాంబినేషన్ సినిమా 'బాద్‌షా' సినిమా షెడ్యూలు జూన్ 15 నుంచి ఉంటుంది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అన్నారు. ఈ చిత్రం బ్రహ్మానదం,ఎన్టీఆర్ మధ్య వచ్చే సీన్స్ హైలెట్ గా ఉంటాయని చెప్తున్నారు. దూకుడు తర్వాత శ్రీను వైట్ల చేస్తున్న చిత్రం కావటంతో సినిమాపై ఓ రేంజి అంచనాలు ఉంటాయనటంలో సందేహం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X