సీతారామంజనేయస్వామి సన్నిధిలో ఎన్టీఆర్ ‘బృందావనం’...
కృష్ణుడుకు సంబంధించిన బృందావనంలో గోపికలతో ఆనందంగా పాటలు పాడుకుంటే ఎలా వుంటుందో అంత ఆహ్లాదకరంగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న'బృందావనం' కోసం మూడురోజులుగా పాటను చిత్రీకరిస్తున్నారు. చిత్రంలోని తారాగణమంతా పాల్గొన్న ఈ పాటను శంషాబాద్ లోని సీతారామంజనేయస్వామి దేవాలయంలో గత మూడురోజలుగా తీస్తున్నారు. శనివారంతో పాట పూర్తిఅయ్యింది.
చిత్రనిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఆగస్టులో లాస్ట్ షేడ్యూల్ చేస్తాం. అదే నెలలో ఆడియోను విడుదల చేస్తాం. సెప్టంబర్ లో సినిమాను రిలీజ్ చేస్తాం అన్నారు. ఎన్టీఆర్ కు బృందావనం అనే టైటిల్ పెట్టడం పట్ల చాలా మంది ఆచ్చర్యం వ్యక్తం చేసారు. సాఫ్ట్ టైటిల్ ఎలా కుదురుతుంది అనేది. కాని ఇందులో అన్ని వున్నాయి. 40 రోజులపాటు యాక్షన్ కుడా చేసాం. పీటర్ హెయిన్స్, రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో చేసాం. మా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ వాల్యును ఈ చిత్రం పెంచుతుంది'అన్నారు.
సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ 'ఇది చాలెంజింగ్ మూవీ. దిల్ రాజు మంచి సపోర్ట్ ఇచ్చారు. నా కెరీర్ లోనే పెద్దచిత్రం అవుతుంది. పెద్ద స్టార్ వున్న చిత్రంకు సంగీతం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ఇంకా నృత్య దర్శకుడు ప్రేమ్ రక్షిత్, గీత రచయితా అనంత శ్రీరాం, చోటా కే నాయుడు, ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ కావాలని ఆకాంక్షించారు.


Click it and Unblock the Notifications











