జూ.ఎన్టీఆర్ ప్లస్ లు మైనస్ లు (పుట్టిన రోజు స్పెషల్)
హైదరాబాద్ : అక్షరాలా పెద్దాయన (ఎన్టీ రామారావు) పోలికలు పుణికిపుచ్చుకున్న మనవడు జూనియర్ ఎన్టీఆర్. డ్యాన్సులు, ఫైటింగులు, నటన, సంభాషణలు- ఎక్కడైనా సరే. ఎన్టీఆర్ తడాఖా చూపిస్తాడు. 'ఎన్టీఆర్ మాత్రమే ఇలా చేయగలడు..' అని ప్రేక్షకులు అనుకొనేలా చేస్తాడు. యాక్షన్ కథ, ఫ్యాక్షన్ సినిమా, లవర్ బోయ్ పాత్రలూ అన్నిటా ఉన్నాడు. అందుకే ఆల్‌రౌండర్ అయ్యాడు.
ఆయన సినీరంగ ప్రవేశం తొలి చిత్రంతోనే నిలిచిపోయేలా యువ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పాటుచేసుకున్నారు. అచిరకాలంలోనే మాస్, క్లాస్ పాత్రలతో ప్రేక్షకులకు చేరువయ్యారు. నటన, డాన్స్ లు, ఫైట్స్ సన్నివేశాల్లో తనదైన విశిష్టశైలిని ప్రదర్శించిన ఎన్టీఆర్, తన చిత్రాల వసూళ్లు, ప్రదర్శన కేంద్రాల సంఖ్యలో సరికొత్త రికార్డులను సృష్టించారు.
'అభిమానులకు ఏం కావాలి? వాళ్లకు ఈ సినిమాతో నేనేం ఇవ్వగలను?' అనే ఆలోచనతో ఎన్టీఆర్ సినిమా ప్రారంభిస్తుంటారు. కేవలం అభిమానుల దగ్గరే ఆగిపోరు. 'నా సినిమా అందరికీ నచ్చాలి. అభిమానులకు ఇంకా నచ్చాలి..' అనుకొనే పద్ధతి ఆయనది. అందుకే జయాపజయాలకు అతీతంగా ఎన్టీఆర్ హవా కొనసాగుతోంది. మంగళవారం ఎన్టీఆర్ జన్మదినం.
స్లైడ్ షోలో ...ఎన్టీఆర్ ఫొటోలు ..విశేషాలతో కలిపి

కథల్లో, ఎన్టీఆర్ పాత్ర తీరుతెన్నుల్లో వైవిధ్యం
'ఆది', 'సింహాద్రి' ఓ వైపు.. 'రాఖీ' సినిమాల్ని బేరీజు వేసుకొంటే ... 'ఆది' మాస్ చేత ఈలలూ వేయించగలడు అని 'సింహాద్రి'నిరూపిస్తే.. ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించనూగలడు.. అని రుజువు చేసింది రాఖీ.

గుక్క తిప్పుకోకుండా...
'యమదొంగ' మరో తరహా... యమసభలో సింహాసనంపై కూర్చుని పేజీల కొద్దీ డైలాగులు గుక్క తిప్పుకోకుండా చెప్పిన వైనం.. ఎవ్వరం మర్చిపోలేం.

కామెడీ...
'అదుర్స్'లో 'చారి' పూయించిన నవ్వుల జల్లుల్లో ఇంకా తడిసిముద్ద అవుతూనే ఉన్నాం. వివి వినాయిక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ కామెడీని వివిధ ఛానెల్స్ లో పండిస్తూనే ఉంది.

నటనా పటిమ...
ఊసరవెల్లి, బృందావనం, దమ్ము, బాద్‌షా, రాఖీ, శక్తి, ఆంధ్రావాలా, రామయ్యా వస్తావయ్యా ఇత్యాది చిత్రాలు ఎన్టీఆర్‌లోని నటనా పటిమను తెలిపాయి.

అన్ని రికార్డులూ ....
'చంపడంలో నీది స్టేట్ రికార్డ్ అయితే నరకడంలో నాకు వరల్డ్ రికార్డు ఉంది' అంటాడు ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా'లో. అమ్మతోడు... అదొక్కటే కాదు, ఆ విషయంలో అన్ని రికార్డులూ ఎన్టీఆర్‌వే.

నమ్మకం...
ఇప్పటివరకు ఎన్టీఆర్ దర్శక నిర్మాతలు సూచించే సమయంకంటే ముందే సెట్‌లో ఉంటూ నిర్మాతలకే కాకుండా పంపిణీదారుల్లో కూడా నమ్మకాన్ని పెంచారు.

నష్టపోకూడదని...
ఎన్టీఆర్ తన చిత్రాల వసూళ్లు నిర్మాతలని గట్టెక్కించేలా ఉండాలని తాపత్రయపడతారు. ఒక చిత్రం భారీ విజయాన్ని సాధించిన వెంటనే తదుపరి చిత్రానికి సంబంధించిన వ్యాపారాలు సాగకుండా అడ్డుకుంటారు.

హిట్ కోసం తపన...
తన చిత్రం బాక్సాఫీస్‌వద్ద విజయవంతం కావడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. నిర్మాత మొదలుకొని పంపిణీదారులవరకూ అందరి ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నిస్తారు. అందుకు తగ్గ ఫలితాన్ని చూపిస్తారు.

దేనికైనా సై...
పంచ్ కొట్టాలన్నా, తొడకొట్టాలన్నా హీరోలలో ముందువరుసలో ఉంటారు. కొత్త చిత్రంలో నటించేందుకు ఎప్పటికప్పుడు తన విధానాలు కట్టుదిట్టంగా మార్చుకుంటారు.

పెద్ద మైనస్
ఎన్టీఆర్ ఎప్పుడూ ఒక హిట్ ఇచ్చిన డైరక్టర్ కి వెంటనే ఛాన్స్ ఇస్తూంటారనేది బాగా వినపడుతున్న విమర్శ. మొదట తన దగ్గరకి వచ్చినా పెద్దగా రెస్పాండ్ గానీ ఎన్టీఆర్ ఓ హిట్ ఇచ్చాక అదే దర్శకుడుని పిలిచి భారీ ఆఫర్ ఇస్తారు. అయితే ఆ సినిమాలేవి ఇప్పటివరకూ హిట్ కాలేదు. హిట్ జోష్ లో ఉన్న దర్శకులు ఎవరూ ఆయన్ని గెలిపించలేకపోతున్నారు.

మరో మైనస్..
సింహాద్రి తర్వాత అంత యాక్షన్ , ఎమోషన్ ఉన్న సినిమా రాలేదని అభిమానులు ఫీలవుతూంటారు. అయితే అంత బలమైన స్క్రిప్టులు కూడా ఆయన ఎంచుకోలేకపోతున్నారు. ఎన్టీఆర్ ఎంత కష్టపడి చేసినా స్క్రిప్టు లేమితో సినిమాలు పెద్దగా వర్కవుట్ కావటం లేదు.

నెక్ట్స్ ...
'రభస' తరవాత ఎన్టీఆర్ పూరి జగన్నాథ్‌తో జత కడతారు. దీనికి సంబంధించి కథ సిద్ధం అవుతోంది. బండ్ల గణేష్ నిర్మాత. వచ్చే ఏడాది జనవరి 9న సినిమాను విడుదలచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











