జూ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌కి ప్రమాదం

By Bojja Kumar

విశాఖపట్నం : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. సడన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ఎన్టీఆర్ క్షేమంగా ఉన్నారని జూ ఎన్టీఆర్ సన్నిహితులు వెల్లడించారు. ఓ ప్రవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎన్టీఆర్ విశాఖ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి...ప్రత్యేక కాన్వాయ్ లో బయల్దేరినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఎన్టీఆర్ సినిమాల వివరాల్లోకి వెళితే....ప్రస్తుతం ఆయన 'బాద్ షా' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్‌పై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఈచిత్రంలో హీరోయిన్. ఈ చిత్రం ఆడియో ఈ మార్చి 10 న విడుదల కానుంది. అదే విధంగా ఏప్రియల్ 5 న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. స

బాద్ షా' చిత్రంలో నవదీప్ విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రం షూటింగ్ రేపటి నుంచి నాగార్జున సాగర్ వద్ద ప్లాన్ చేసారు. ఇక్కడ జూ ఎన్టీఆర్-నవదీప్ మధ్య ఫైట్ సీన్స్ ప్లాన్ చేసారు. నాగార్జున సాగర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా మరికొన్ని సీన్లు చిత్రీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసారు.

ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, గోపీ మోహన్, కోన వెంకట్ స్క్రిప్టు రచయితులగా పని చేస్తున్నారు. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X