ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా దుమ్మురేపి నెగ్గుకురావడం జూ ఎన్టీఆర్ దమ్ము
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దమ్ము" సినిమా హైదరాబాద్ శివార్లలో షూటింగ్ జరుపుకుంటుంది. పొల్లాచ్చి లో షూటింగ్ జరగాల్సి ఉండగా వాతావరణం సరిగా లేకపోవడంతో చిత్ర యూనిట్ హైదరాబాదుకి మార్చారు. నెలాఖరు వరకూ హైదరాబాద్ లోనే కీలక సన్నివేశాలు, పోరాట ఘట్టాలు తెరకెక్కిస్తారు. మైసూర్‌లో కీలక భాగం తెరకెక్కిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని బోయపాటి శీను దర్శకత్వం వహిస్తున్నారు. త్రిష మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా కార్తిక సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం లో ఎన్టీఆర్ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారని యూనిట్ వర్గాల సమాచారం. అలెగ్జాండర్ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
కాగా ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ...ధైర్యమంటే చీకట్లో ఒంటరిగా నడుచుకొంటూ వెళ్లడం కాదు.. అదే దారిలో వచ్చే పదిమందికి వెలుగు చూపించడం. దమ్మంటే ఒంటి చేత్తో వందమందిని చితగ్గొట్టడం కాదు.. ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా దుమ్మురేపి నెగ్గుకురావడం. మా హీరో అదే చేశాడు. ఈ ప్రయాణంలో అతనికి ఎదురైన అనుభవాలేంటో మా సినిమా చూసి తెలుసుకోండి అన్నారు. అలాగే 'పేరుకు తగ్గట్టే దమ్మున్న కథ ఇది. ఎన్టీఆర్ లోని యాక్షన్ కోణాన్ని మరో విధంగా చూపిస్తున్నాం. తెలుగు ప్రేక్షకులకు కావల్సిన అన్ని అంశాలూ ఉంటాయి.
ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న దమ్ము పైనే ఎన్టీఆర్ పూర్తిగా దృష్టి పెడుతున్నారు. సింహాతో తన బాబాయ్ బాలకృష్ణను సూపర్ హిట్ బాటలోకి మళ్లీ ప్రయాణింప చేసిన బోయపాటి తనకీ ఆ రేంజి హిట్ ఇస్తాడని భావిస్తున్నాడు. అందుకునే ఆ సినిమా విడుదల అయ్యేదాకా నోరు విప్పకూడదని నిర్ణయించుకన్నాడు. తన సక్సెస్ మాట్లాడాలని ఎన్టీఆర్ పూర్తి స్ధాయిలో పోరాడుతున్నాడు. తొట్టింపూడి వేణు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి బావగా కనిపించనున్నారు.భానుప్రియ ..ఎన్టీఆర్ కి తల్లిగా చేస్తోంది. ఇలా ఎక్కడా రాజీపడకుండా అద్బుతమైన తారాగణంతో ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేయాలని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











