జూ ఎన్టీఆర్ కూడా అదే స్పాట్‌లో ‘దమ్ము’ చూపేందుకు..
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం 'దమ్ము' షూటింగ్ కు సంబంధించి హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయింది. నగరం పరిసర ప్రాంతాల్లో రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పలు యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం 'దమ్ము' యూనిట్ షూటింగ్ తర్వాతి సెడ్యూల్ కోసం తమిళనాడులోని పొల్లాచ్చి బయల్దేరుతోంది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ షూటింగ్ ఇటీవల అక్కడ పూర్తవడం, తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా తన దమ్ము చూపేందుకు పొల్లాచ్చి వెలుతుండటం చర్చనీయాంశం అయింది.
మాస్ మసాలా, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న 'దమ్ము' చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన త్రిష, కార్తీక నటిస్తున్నారు. అలెగ్జాండర్ వల్లభ క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కె.ఎస్.రామారావు సమర్పకులు. మార్చి 28న దమ్ము చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











