For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హిందీలోనూ ఇరగతీస్తున్న జూ.ఎన్టీఆర్

  By Srikanya
  |

  హైదరాబాద్ : జూ. ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు యూ ట్యూబ్ ని ఊపేస్తోంది. ఆయన నటించిన "బాద్షా" హిందీ డబ్బింగ్ వెర్షన్ "రౌడీ బాద్షా" టైటిల్ తో ఇప్పుడు యూట్యూబ్ లో దాదాపు నలభై లక్షలుకు పైగా వ్యూయర్స్ తో ముందుకు దూసుకువెళ్తోంది. హిందీ ఆడియన్స్ లో కూడా ఎన్టీఆర్ స్టామినా ఈ చిత్రం చూపుతోందంటున్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  "బాద్షా" కథేమిటంటే.... ఇటలీలో ఉంటున్న జానకి(కాజల్) ని అనుకోని పరిస్ధితుల్లో కలిసిన(ఆ తర్వాత అనుకునే కలిసాడని రివిల్ అవుతుందనుకోండి) రామారావు(ఎన్టీఆర్)ఆమెని తొలి చూపులోనే ఇష్టపడతాడు. ఆమె ఎప్పుడూ చెప్పే బంతి థీరిని తెగ మెచ్చుసుకుంటూ ఆమెని బుట్టలో పడేసే ప్రయత్నం చేస్తాడు. మరో ప్రక్క అతన్ని ఇంటర్నేషనల్ మాఫియా వెంటాడుతూ చంపేసే ప్రయత్నం చేస్తుంది. వారితో చేసిన ఫైట్ ని తనకోసమే చేసాడుకున్న జానికి అతనితో ప్రేమలో పడిపోయి... పాటలు పాడేసుకుంటుంది. ఇంతకీ ఇతరదేశాలు వచ్చి మరీ రామారావు ఈమెనే ఎంపిక చేసుకుని ప్రేమలో దింపటానికి కారణం ఏమిటి... అతన్ని అంత పెద్ద మాఫియా వెంటేడేటంత గతం ఏమిటి... ఇంతకీ బాధ్షాకీ, ఎన్టీఆర్ కు ఉన్న రిలేషన్ ఏమిటి అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  ఎన్టీఆర్ తాజా చిత్రం ‘టెంపర్' విషయానికి వస్తే...

  ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టెంపర్'. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం ‘టెంపర్' ఆడియోను జనవరి 28న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

  Jr NTR’s Hindi power on YouTube

  అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే టీజర్ లో అనూప్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. ఎన్టీఆర్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. పరమేశ్వరా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 13న సినిమాను విడుదల చేయనున్నారు.

  ‘టెంపర్' ఆడియో వేడుక వేదిక మార్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఆడియో వేడుక తొలుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో జరుపాలని నిర్ణయించారు. అయితే దీని వల్ల ఖర్చు ఎక్కువ అయ్యే అవకాశం ఉండటంతో హైదరాబాద్ లోనే ఆడియో ఫంక్షన్ నిర్వహించాలని నిర్మాత బండ్ల గణేష్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో ఆడియో ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారనేది త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

  మరో వైపు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఓ చానల్ ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని దక్కించుకుందని తెలుస్తోంది. 7.7 కోట్లకు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ని ఆ చానల్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

  అలాగే...ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ టీజర్ నూతన సంవత్సర కానుకగా ఈ రోజు విడుదలైన సంగతి తెలిసిందే. ‘ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒకడు మీదపడితే దండయాత్ర...ఇది దయాగాడి దండయాత్ర' అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ తో విడుదల చేసిన ఈ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

  Jr NTR’s Hindi power on YouTube

  నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...మా బేనర్లో నిర్మిస్తున్న ‘టెంపర్' చిత్రానికి సంబంధించిన టీజర్ నూతన సంవత్సర కానుకగా ఈ రోజు విడుదల చేసాం. రెస్పాన్స్ బాగుంది. ఎన్టీఆర్ లుక్, స్టైల్స్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇటీవల విడుదలైన సిక్స్ ప్యాక్ లుక్ కి ఎంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందో అందరికీ తెలిసిందే. ఇపుడు రిలీజైన టీజర్‌కి దాన్ని మించిన రెస్పాన్స్ వస్తోంది.

  ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంటుగా, ఎంతో పవర్ ఫుల్‌గా ఉంటుంది. ఈ సినిమా బేనర్ ప్రతిష్టను మరింత పెంచే సినిమా అవుతుంది. అలాగే ఎన్టీఆర్ గారి కెరీర్లో, పూరి జగన్నాథ్ గారి కెరీర్లో, నా కెరీర్లో ‘టెంపర్' బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న నమ్మకం నాకు ఉంది. ఈ నెల 20 వరకు జరిగే షెడ్యూల్ తో టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. మరో పక్క పోస్టు ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నాం' అన్నారు.

  ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, మధురిమ బెనర్జీ, వెన్నెల కిషోర్, జయప్రకాష్ రెడ్డి, సప్తగిరి, కోవై సరళ, రమా ప్రభ, పవిత్ర లోకేష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

  ఈ చిత్రానికి కథ: వక్కతం వంశీ, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, సంగీతం: అనూప్ రూబెన్స్, ఆర్ట్: బ్రహ్మకడలి, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఫైట్స్: విజయ్, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం: పూరి జగన్నాథ్.

  English summary
  Ntr's “Baadshah” directed by Srinu Vaitla is dubbed into Hindi as “RowdyBaadshah”. When this film uploaded on YouTube it got 4,063,226 (nearly 40 lakhs) hits.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X