జూ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ ఫస్ట్ లుక్ (పోస్టర్)

By Bojja Kumar

హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా ఈ చిత్రానికి ‘నాన్నకు ప్రేమతో' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇపుడు అదే టైటిల్ ఖరారు చేస్తూ వినాయక చవితి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసారు. ఎన్టీఆర్ డిఫరెంట్ స్టైలిష్ లుక్ సూపర్బ్ గా ఉంది.

ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. ఈ చిత్రం జనవరి 8,2016న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ లోగా దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 22న టీజర్ ని విడుదల చేయాలని నిర్ణయించారు.

'ఆంధ్రావాలా'లో తొలిసారి రెండు పాత్రల్లో కనిపించాడు ఎన్టీఆర్‌. ఆ తరవాత 'అదుర్స్‌'లోనూ ఇద్దరిగా వినోదం పంచాడు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడా? ఔననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. సుకుమార్‌ దర్శకుడు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ప్రస్తుతం లండన్‌లో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం.

Jr Ntr's Nannaku Prematho first look

ఓ పాత్ర కోసం గడ్డంతో, స్త్టెలిష్‌గా కనిపిస్తున్నాడు తారక్‌. ప్రస్తుతం ఆ గెటప్పే చిత్ర బృందం బయటపెట్టింది. అయితే.. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మరో పాత్రలో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. ఆ గెటప్‌ను చిత్రబృందం గోప్యంగా ఉంచుతోంది. ఈ ఇద్దరి ఎన్టీఆర్‌ల మధ్య ఉన్న సంబంధం ఏమిటన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

ఎన్టీఆర్, సుకుమార్ ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రమిది. ఎన్టీఆర్ కి మా బేనర్లో ఇది మరో సూపర్ హిట్ మూవీ అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ దేవిశ్రీ ప్రసాద్ ఆధ్వర్యంలో స్పెయిన్ లో జరిగాయి. దేవి ఐదు అద్భుతమైన పాటల్నిఇచ్చారు అని నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ తెలిపారు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కో-ప్రొడ్యూసర్: భోగవల్లి బాపినీడు, సమర్పణ: రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్: నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుకుమార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X