జూ ఎన్టీఆర్ ‘బాద్ షా’ న్యూలుక్
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ప్రస్తుతం 'బాద్ షా' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో ఎన్టీఆర్ డిఫరెంట్ గెటప్ లలో, సరికొత్త హెయిర్ స్టైల్స్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఎన్టీఆర్ డిఫరెంట్ గెటప్స్ విడుదలయ్యాయి. తాజాగా మరో న్యూలుక్ రిలీజ్ అయింది. ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ తో కలిసి దిగన ఈ ఫోటోలో ఎన్టీఆర్ గెటప్ అదుర్స్ అంటున్నారంతా..
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. షూటింగ్ జరుపుకుంటూనే మరో వైపు పోస్టు ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. సమ్మర్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ 'బాద్ షా' చిత్రానికి పని చేస్తున్నారు.
ఇటీవల శ్రీకాంత్ హీరోగా వచ్చిన 'దేవరాయ' చిత్రం సెక్సీగా తన అందాలు ప్రదర్శించిన మీనాక్షి దీక్షిత్‌ను ఈ చిత్రంలో గ్లామర్ పెర్ఫార్మెన్స్ కోసం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తర్వలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
జూ ఎన్టీఆర్ కు ఫ్యామిలీ ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కు తోడు, ఢీ, రెడీ, దూకుడు లాంటి హిట్ చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల సినిమా కావడంతో ఈ చిత్రానికి బుల్లితెర మార్కెట్లో డిమాండ్ ఏర్పడి శాటిలైట్ రైట్స్ భారీగా వచ్చాయని టాక్. ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు ఇతర సాంకేతిక నిపుణులుగా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.


Click it and Unblock the Notifications











