NTR షర్ట్‌పై తెలుగుదేశం పార్టీ గుర్తు.. RRR ప్రమోషన్స్‌లో పచ్చ చొక్కా కలకలం.. అసలేం జరిగిందంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్‌లో తొలి ప్యాన్ ఇండియా సినిమా కోసం బిజీగా మారిపోయారు. RRR సినిమా కోసం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రాజమౌళి, రాంచరణ్‌తో కలిసి పర్యటిస్తున్నారు. తాజాగా ముంబైలో విస్తృతంగా పర్యటిస్తూ ఉత్తరాది మీడియాతో తన భావాలను పంచుకొంటున్నారు. అయితే ఇటీవల ఓ ఈవెంట్ కోసం పచ్చ చొక్కా వేసుకొని ఫోజిచ్చిన ఎన్టీఆర్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఎన్టీఆర్ అభిమానుల్లో ఆసక్తి నింపిన ఆ ఫోటో వెనుక కథ ఏమిటి? టీడీపీ అభిమానులు చేసిన నిర్వాకం ఏమిటనే వివరాల్లోకి వెళితే..

ముంబైలో మకాం వేసిన ఎన్టీఆర్
భారతీయ సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న RRR సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ ముంబైలో మకాం వేశారు. బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ అధ్వర్యంలో జరుగుతున్న ప్రమోషన్ ఈవెంట్లలో చురుకుగా పాల్గొంటూ జాతీయ మీడియాలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారారు. ఉత్తరాది మీడియాను తనదైన శైలిలో ఆకట్టుకొంటూ మరింత పాపులారిటీని పెంచుకొంటూ ముందుకు వెళ్తున్నారు.

సల్మాన్ బిగ్‌బాస్ షోలో ఎన్టీఆర్
RRR సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రేక్షకులను ఆ సినిమాను మరింత చేరువగా చేయడానికి ముంబైలో ఎక్కని గడప లేదు.. దిగన మెట్టు లేదనే విధంగా కనిపించింది. తాజాగా సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్ షో వేదికపై కూడా ప్రమోషన్స్ భారీగా నిర్వహించారు. ఆ ఈవెంట్‌కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

రానా దగ్గుబాటితో కలిసి RRR
ముంబైలో జరుగుతున్న RRR సినిమా ప్రచార కార్యక్రమాల్లో రాజమౌళి, రాంచరణ్, రామారావు ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఈ ముగ్గురికి తోడుగా రానా దగ్గుబాటి కూడా చేరి.. ఫోటోకు ఫోజిచ్చారు. ఆ ఫోటోకు సోషల్ మీడియాలో విశేషంగా స్పందన లభించింది. ముగ్గురు R లకు తోడుగా మరో R కూడా తోడైందనే కామెంట్లతో అభిమానులు హోరెత్తించారు.

RRR కోసం ప్రత్యేకంగా డిజైన్ షర్ట్స్
బాహుబలి సినిమా ప్రమోషన్స్ సందర్భంగా డిజైన్ చేసిన డ్రస్సుల మాదిరిగానే
RRR సినిమా కోసం కూడా ఆ మూవీ టైటిల్‌ను ష్టర్‌లపై, చైనీస్ కాలర్ షర్ట్స్‌పై ప్రింట్ చేయించారు. అయితే ముంబైలో ఓ ఈవెంట్ కోసం పసుపు పచ్చని షర్ట్ వేసుకోని ఎన్టీఆర్ రాజసంగా కెమెరాలకు ఫోజిచ్చారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయింది.

ఎన్టీఆర్ మార్పింగ్ ఫోటోతో కలకలం
అయితే పసుపు పచ్చ షర్ట్ వేసుకొని ఎన్టీఆర్ దిగిన ఫోటోను తెలుగుదేశం అభిమానులు మార్పింగ్ చేసి ఆ పార్టీ గుర్తును ఆయన ఎడమవైపు ఛాతిపై ప్రింట్ చేసి సోషల్ మీడియాలోకి వదిలారు. ఆ ఫోటోను చూడగానే టీడీపీ అభిమానులు ఫిదా అయి షేర్ చేశారు. అయితే ఆ ఫోటో మార్పింగ్ చేసిందనే విషయం తెలియగానే ఎన్టీఆర్, టీడీపీ అభిమానులు నిరాశపడ్డారు. ప్రస్తుతం ఆ ఫోటోపై అభిమానులు భారీగా చర్చించుకొంటూ సోషల్ మీడియాలో కనిపించారు. ఎన్టీఆర్ అలాంటి షర్ట్ ధరించి పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు జోష్ కలిగిస్తారనే మాటను బయటపెడుతున్నారు.


Click it and Unblock the Notifications











