పోచంపల్లిలో బ్రేక్ ఫైట్ చేస్తున్న జూ ఎన్టీఆర్ 'శక్తి’కి అవే మెయిన్ హైలైట్స్
ఎన్టీఆర్, మెహర్ రమేష్ కాంబినేషన్‌లో రెడీ అవుతున్న 'శక్తి" చిత్రాన్ని డిసెంబర్ 24న రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ తమ వైజయంతీ మూవీస్ పతాకంపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం పోచంపల్లిలో జరుగుతోంది. ఈ షూటింగ్ ఎన్టీఆర్ ఫైట్ చేసే కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ ఇంటర్ వెల్ టైమ్ లో వస్తుందట. అలాగే కొన్ని ఫైటింగ్ సీన్స్ ను హెలికాప్టర్ సహాయంతో చిత్రీకరించారు. 15నిమిషాల పాటు కొనసాగే ఈ సీన్సే సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని ఈ చిత్ర యూనిట్ అంటోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో జాకీషరఫ్, పూజా బేడీ, సోనూ సూద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కాగా ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం 'బృందావనం" చిత్రం ఈ నెల 14న తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాజల్, సమంత హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించారు.


Click it and Unblock the Notifications











